Home టోటల్ కలెక్షన్స్ 1.2 కోట్ల బడ్జెట్…OTT ఫస్ట్ హిట్ కృష్ణ అండ్ హిస్ లీల…టోటల్ కలెక్షన్స్ ఇవే!!

1.2 కోట్ల బడ్జెట్…OTT ఫస్ట్ హిట్ కృష్ణ అండ్ హిస్ లీల…టోటల్ కలెక్షన్స్ ఇవే!!

0

కరోనా వలన సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం లేదు కాబట్టి, డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ లను సొంతం చేసుకున్న సినిమాలు చాలా ఉండగా, వాటిలో ఆడియన్స్ ని అలరించిన సినిమాలు మాత్రమె కొన్నే ఉన్నాయి, వాటి లో తెలుగు లో అయితే అవి మరింత తక్కువ సినిమాలే అని చెప్పాలి. కాగా తెలుగు లో ఆడియన్స్ ని అలరించిన OTT రిలీజ్ సినిమాలలో చిన్న సినిమా కృష్ణ అండ్ హిస్ లీల ఒకటి…

జూన్ ఎండ్ వీక్ లో డైరెక్ట్ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా అలరించగా రిలీజ్ అయ్యి మూడు నెలలను పూర్తీ చేసుకున్న ఈ సినిమా OTT వ్యూస్ లెక్కలు ట్రేడ్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి, వాటి ప్రకారం సినిమా డిజిటల్ రిలీజ్ లో సాలిడ్ విజయాన్ని నమోదు చేసిందని చెప్పొచ్చు.

సినిమా ను మొత్తం మీద 1.2 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా 3 ఏళ్ల తర్వాత సినిమాను సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు 1.5 కోట్ల రేటు కి కొని తర్వాత… డైరెక్ట్ రిలీజ్ ని 2 యాప్స్ లో అమ్మారు, నెట్ ఫ్లిక్స్ లో సినిమా కి 2.4 కోట్ల రేటు దక్కింది…

తర్వాత ఆహా యాప్ లో సినిమా కి 2.2 కోట్లకి అమ్మారు… ఇక సినిమా శాటిలైట్ రైట్స్ కింద 1.5 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 60 లక్షల రేటు దక్కగా ఇక్కడే టోటల్ గా సినిమా నుండి 6.7 కోట్ల రెవెన్యు దక్కగా బడ్జెట్ మీద ఏకంగా 5.5 కోట్ల ప్రాఫిట్ ని సినిమా సాధించింది. ఇక సినిమా కి నెట్ ఫ్లిక్స్ లో సుమారు 11 లక్షల దాకా యూనిట్ వ్యూస్ దక్కాయట…

ఇక ఆహా యాప్ లో సినిమా కి 8 లక్షలకి పైగానే వ్యూస్ దక్కాయని అంటున్నారు… మొత్తం మీద నెట్ ఫ్లిక్స్ రేట్లు ఎక్కువ కాబట్టి వాళ్లకి సుమారు 3.5 కోట్ల మేర రెవెన్యూ వచ్చిందని ఇక ఆహా వాళ్లకి 2.5 కోట్ల దాకా రెవెన్యూ దక్కి ఉంటుందని ట్రేడ్ లో చెబుతున్నారు… అంటే సినిమా ను కొన్న రెండు యాప్స్ కి కూడా సినిమా ద్వారా మంచి ప్రాఫిట్ దక్కిందని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here