Home గాసిప్స్ కొమరం భీమ్ లుక్ కన్నా ముందే వచ్చేసిన ఎన్టీఆర్ లుక్!!

కొమరం భీమ్ లుక్ కన్నా ముందే వచ్చేసిన ఎన్టీఆర్ లుక్!!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మమ్మోత్ మూవీ ఆర్ ఆర్ ఆర్… ఈ ఏడాది రామ్ చరణ్ పుట్టిన రోజు కానుకగా ఇంట్రో టీసర్ ని ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయగా అల్టిమేట్ రెస్పాన్స్ రాగా ఎన్టీఆర్ లుక్ అండ్ టీసర్ ఎలా ఉంటాయి అన్న ఆసక్తి అందరిలోనూ మొదలు అవ్వగా కరోనా వలన….

ఫస్ట్ లుక్ ని కానీ ఇంట్రో టీసర్ ని కానీ రిలీజ్ చేయడం కుదరలేదు, ఆల్ మోస్ట్ 6 నెలల నాన్ స్టాప్ పోస్ట్ పోనుల తర్వాత ఎట్టకేలకు ఈ నెల మొదటి వారం లో సినిమా లో ఎన్టీఆర్ లుక్ ని టీసర్ ని రిలీజ్ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు,

రీసెంట్ గా షూటింగ్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఇంట్రో టీసర్ ఇప్పుడు స్పెషల్ ఎఫెక్ట్ ల పనులలో బిజీగా ఉండగా మరో పక్కా ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణం లో అప్పీ ఫిజ్ యాడ్ రిలీజ్ అయ్యింది.

ఈ యాడ్ ను లాస్ట్ మొంత్ ఎండ్ అంటే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కి ముందు షూట్ చేయగా ఇప్పుడు రిలీజ్ చేశారు, అందులో లుక్ మాదిరిగానే ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ లో లుక్ ని రిలీజ్ చేయబోతున్నారు అన్నది టాలీవుడ్ లేటెస్ట్ టాక్… డ్రెస్ మారుతుందని, రాజమౌళి టేకింగ్ మారుతుందని మొత్తం మీద…

లుక్ మాత్రం ఇలానే ఉంటుందని అంటున్నారు ఇప్పుడు, ఈ లుక్ కూడా అదిరిపోయే విధంగా ఉండగా అందరూ కొమరం భీమ్ గా ఎన్టీఆర్ లుక్ అండ్ రాజమౌళి అల్టిమేట్ గూస్ బంప్స్ ఎలివేషన్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని ఆశగా ఎదురు చూస్తున్నారు, ఇంట్రో టీసర్ ని ఈ నెల 22 న రిలీజ్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here