బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు కానీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న నాని సుధీర్ బాబులు కలిసి నటించిన సినిమా వి ది మూవీ అమెజాన్ ప్రైమ్ భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుంది. ఏకంగా 35.4 కోట్ల రేటు చెల్లించి సినిమా హక్కులను సొంతం చేసుకున్న అమెజాన్ ప్రైమ్ లాస్ట్ మంత్ సినిమాను రిలీజ్ చేయగా మొదటి నెలలో…
సినిమా కి మొత్తం మీద యూనిక్ వ్యూస్ ద్వారా 1.5 మిలియన్స్ దాకా వ్యూస్ దక్కాయి, సబ్ స్క్రిప్షన్ తీసుకున్న యూసర్స్ నుండి యూనిక్ వ్యూస్ ద్వారా ఈ వ్యూస్ ని కౌంట్ చేయగా ఓవరాల్ గా రఫ్ గా సినిమా ద్వారా అమెజాన్ ప్రైమ్ కి మొదటి నెలలో 19 కోట్లకు పైగా…
రెవెన్యూ వచ్చి ఉండొచ్చని అంచనా వేశారు ట్రేడ్ లో… కానీ కొన్న రేటు కి ఇవి చాలా తక్కువ వ్యూస్ అవ్వడం తో నష్టాలూ బాగా వస్తున్నాయని, అమెజాన్ ప్రైమ్ వాళ్ళు సినిమా నిర్మాత దిల్ రాజుని ఎంతో కొంత అమౌంట్ వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దాంతో పాటు అప్ కమింగ్ మూవీ డీల్స్ మీద ఇది ఇంపాక్ట్ చూపుతుందని కూడా చెప్పారు, ఇది చెప్పి 10-15 రోజులు కావస్తున్నా కానీ బాలెన్స్ షీట్ ని చూసి ఇప్పటి వరకు దిల్ రాజు అమెజాన్ ప్రైమ్ వాళ్లకి ఎలాంటి ఆన్సర్ ఇవ్వలేదని, సైలెంట్ గా ఉంటూ వస్తున్నారని వార్తలు ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతున్నాయి, దాంతో పాటు….
అప్ కమింగ్ మూవీస్ మీద ఇంపాక్ట్ పడుతుంది అన్న మాటకి, అప్పటి విషయం అప్పుడు చూద్దాం లే అన్నట్లు అనుకుంటున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఏ డిజిటల్ రిలీజ్ డీల్ లో కూడా ఇలా దెబ్బ పడింది డబ్బులు రిటర్న్ ఇవ్వండి అంటూ ఎవ్వరూ అడగలేదు ఇప్పుడేంటి కొత్తగా అని లైట్ తీసుకుంటున్నారట.