సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు సొంత డబ్బు కన్నా కూడా ఫైనాన్స్ మీద తీసుకువచ్చిన డబ్బు తోనే ఎక్కువగా సినిమాలు చేస్తూ ఉంటారు, కొన్ని సార్లు ఫైనాన్స్ డిలే అయితే లెక్కలు కూడా మారిపోతాయి. ఇలాంటివే రీసెంట్ గా అనుభవించిన కోలివుడ్ స్టార్ హీరో సూర్య తన లేటెస్ట్ మూవీ సూరరై పొట్రు సినిమా విషయంలో జరిగిన విషయాలను రీసెంట్ గా పంచుకోగా 70 కోట్ల అప్పులను తనని నమ్ముకున్న వాళ్ళని…
ఆదుకోవడం కోసం సినిమా ను డైరెక్ట్ రిలీజ్ చేయడం పై కామెంట్ చేసి అందరి మెప్పు మరోసారి సొంతం చేసుకోగా, ఒకవేళ డైరెక్ట్ OTT రిలీజ్ కూడా లేకపోతే ఎం చేసేవారు అన్న ప్రశ్న కి కూడా తనదైన స్టైల్ లో సమాదానం ఇచ్చారు. ఆ పరిస్థితిని ఎవ్వరూ ఊహించలేదు కానీ…
మరీ అంత ప్రెజర్ కనుక వస్తే…తనని నమ్ముకున్న వాళ్ళని కచ్చితంగా ఆదుకునే వాడిని అని, దానికోసం తన ఆస్తులను అయినా అమ్మేసేవాడిని అంటూ చెప్పుకొచ్చారు సూర్య… ఈ మాటలకు సూర్యని మరింత పొగిడేస్తున్నారు అందరూ. తన నిర్మాణంలో 8 సినిమాలు ఒకే టైం లో తెరకేక్కుతుండటం వలనే…
ఇలాంటి పరిస్థితి వచ్చిందని, అప్పుడు ఉన్న ఆప్షన్స్ లో డైరెక్ట్ రిలీజ్ బెటర్ ఆప్షన్ గా అనిపించడం వలనే డైరెక్ట్ రిలీజ్ కి ఒప్పుకున్నానని చెప్పాడు సూర్య. కాగా సినిమా డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకుని అద్బుతమైన పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుని భారీ వ్యూవర్ షిప్ తో దూసుకు పోతూ ఉండగా… సినిమా కి పెట్టిన 65 కోట్ల రేటుకి…
అమెజాన్ ప్రైమ్ సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుంటూ రెవెన్యూని జనరేట్ చేసుకుంటుంది. లాంగ్ రన్ లో ఇండియా లో డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో బిగ్గెస్ట్ వ్యూవర్ షిప్ ని సొంతం చేసుకునే సినిమాగా ఈ సినిమా నిలవడం ఖాయమని అంతా భావిస్తున్నారు ఇప్పుడు.