Home న్యూస్ ఆండ్రాయిడ్ కట్టప్ప 30 డేస్ వ్యూస్ & కలెక్షన్స్…దుమ్ము లేచిపోయిందిగా!!

ఆండ్రాయిడ్ కట్టప్ప 30 డేస్ వ్యూస్ & కలెక్షన్స్…దుమ్ము లేచిపోయిందిగా!!

0

రీసెంట్ గా తెలుగు లో డిజిటల్ రిలీజ్ ని సొంతం చేసుకున్న సినిమాల్లో ఆహా వీడియో లో ఎక్కువగా మలయాళం సినిమాలను తెలుగు లో డబ్ చేసి రిలీజ్ చేయగా వాటిలో కొన్ని సినిమాలు తెలుగు ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి, వాటిలో ఆండ్రాయిడ్ కట్టప్ప 5.25 మూవీ కూడా ఒకటి, ఎవరూ ఎక్స్ పెర్ట్ చేయని విధంగా చాలా సైలెంట్ రిలీజ్ ని సొంతం చేసుకున్నా కానీ పాజిటివ్ టాక్ పవర్ తో సినిమా…

తెలుగు లో లాంగ్ రన్ లో సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది, సినిమా ను ఆహా వీడియో వాళ్ళు 1.8 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకుని డైరెక్ట్ రిలీజ్ చేయగా మొదటి వీకెండ్ కొంచం స్లోగానే పికప్ అయిన సినిమా 50 వేల వ్యూస్ ని….

మాత్రమే మొత్తం మీద సొంతం చేసుకుంది, కానీ 30 రోజుల లెక్కల విషయానికి వస్తే సాలిడ్ ఇంప్రూవ్ మెంట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొత్తం మీద నెల రోజులలో 3 లక్షల 15 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

మొదటి వీకెండ్ తో పోల్చితే ఇవి ఎక్స్ లెంట్ గ్రోత్ అనే చెప్పాలి. ఇక 3 లక్షల 15 వేల వ్యూస్ కి సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంది అన్నది గమనిస్తే… ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటు గా భావిస్తే 3 లక్షల 15 వేల వ్యూస్ కి మొత్తం మీద ఆండ్రాయిడ్ కట్టప్ప 5.25 మూవీ….

1.57 కోట్ల దాకా కలెక్షన్స్ ని సొంతం చేసుకుని ఉండొచ్చు అని అంచనా వేయవచ్చు, ఓవర్సీస్ సబ్ స్క్రిప్షన్ రేటు ఎక్కువే కాబట్టి ఈ లెక్క ఇంకాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. ఇక రెండో నెల లెక్కలు ఇంకా రావాల్సి ఉండగా వాటితో సినిమా పెట్టిన డబ్బు మీద మంచి లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here