టాలీవుడ్ కింగ్ నాగార్జున బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుని చాలా టైం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే, సోగ్గాడే చిన్ని నాయన, ఊపిరి లాంటి బాక్ టు బాక్ అద్బుతమైన సినిమాలతో ఆడియన్స్ ను మెప్పించిన నాగార్జున రీసెంట్ మూవీస్ మాత్రం ఫ్యాన్స్ కూడా ఇవేమీ సినిమాలు అనిపించాయి, ముఖ్యంగా ఆఫీసర్ మరియు మన్మథుడు2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని డిసాస్టర్ మూవీస్ గా నిలవగా…
బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున ఒక కమర్షియల్ మూవీ తో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా మళ్ళీ ప్రయోగం అయిన వైల్డ్ డాగ్ తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుండగా ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ కూడా టెన్షన్ పడుతున్నారు. కానీ ఇప్పుడు….
ఈ సినిమా రిలీజ్ థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కాబోతుంది అంటూ టాక్ గట్టిగానే వినిపిస్తుండగా రీసెంట్ గా సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను నెట్ ఫ్లిక్స్ వాళ్లకి మంచి రేటు కి అమ్మారని టాక్ గట్టిగా వినిపిస్తున్న నేపధ్యంలో ఇది నిజం అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అంటున్నారు.
రేటు ఎంత అనేది ఇంకా బయటికి రాలేదు కానీ సినిమా కి నాగార్జున లాస్ట్ 2 మూవీస్ డిసాస్టర్లు అయినా ఈ సినిమా కి మంచి రేటు దక్కింది అంటున్నారు. ఎక్స్ పెరిమెంటల్ మూవీ కావడం తో థియేటర్స్ లో రిలీజ్ అయినా ప్రస్తుత పరిస్థితుల నేపధ్యంలో జనాలు ఎంతవరకు వస్తారు అన్నది అనుమానంగానే ఉండటం తో… సేఫ్ జోన్ లో ఉండటానికి ఈ నిర్ణయం…
తీసుకున్నారని అంటున్నారు. రీసెంట్ గా సినిమా షూటింగ్ ఆగమేఘాల మీద కంప్లీట్ చేయడానికి రీజన్ కూడా ఇదే అంటున్నారు. ఇక సినిమా పై త్వరలోనే అనౌన్స్ మెంట్ జరిగే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. ఇది కనుక నిజం అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నాగార్జున కంబ్యాక్ కోసం మరింత టైం పట్టే అవకాశం ఉందని చెప్పాలి.