తెలుగు లో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేయని విజయాన్ని సొంతం చేసుకున్న అతి కొన్ని సినిమాలల్లో సిద్దార్థ్ జెనీలియా ల కాంబినేషన్ లో వచ్చిన బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన మొదటి ఆటకే అల్ట్రా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని ఊహకందని కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది ఈ సినిమా…
అలాంటి ఈ సినిమా రీమేక్ ల పరంగా కూడా ఇతర ఇండస్ట్రీలలో సెన్సేషన్ ని క్రియేట్ చేయగా బాలీవుడ్ లో మరో లెవల్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అని అంతా ఎక్స్ పెర్ట్ చేస్తున్న టైం లో అప్పుడే భారీ బడ్జెట్ మూవీస్ తో లాంచ్ అయిన…
జూనియర్ హృతిక్ రోషన్ హార్మన్ భవేజా తో జెనీలియా మళ్ళీ తన రోల్ ని తనే చేయగా ప్రకాష్ రాజ్ రోల్ లో నానా పటేకర్ నటించిన ఈ సినిమా 2007లోనే పూర్తీ అయ్యి రిలీజ్ అవ్వాల్సిన కానీ అనుకోకుండా ఆగిపోయిన ఈ సినిమా 13 ఏళ్ల దాకా అలానే ఉంది.
ఎట్టకేలకు రీసెంట్ గా ఈ సినిమా డైరెక్ట్ గా టెలివిజన్ లో డైరెక్ట్ రిలీజ్ చేశారు, జీ సినిమా హిందీ లో ఈ సినిమాను ఈ మధ్యే టెలికాస్ట్ చేయగా సినిమాను ఎంతకు అమ్మారు అన్నది ఆసక్తిగా మారగా సినిమా తెరకెక్కడం అప్పుడే 30 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కగా… ఇప్పుడు బిజినెస్ పరంగా శాటిలైట్ అండ్ డిజిటల్ రైట్స్ కింద…
40 కోట్ల రేటు ని రెండూ కలిపి సొంతం చేసుకుందట ఈ సినిమా, 13 ఏళ్ల తర్వాత కూడా సినిమా మొత్తం మీద హిందీ లో కూడా నిర్మాతకు ప్రాఫిట్స్ ని ఇచ్చింది అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర అప్పుడే రిలీజ్ అయ్యి ఉంటె రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చి ఉండేది ఏమో అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.