మాస్ మహారాజ్ రవితేజ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన స్టైల్ లో దుమ్ము లేపి చాలా టైం అవుతుంది, రాజా ది గ్రేట్ తర్వాత చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరుస్తూ రాగా తన లాస్ట్ 2 సినిమాలు బడ్జెట్ పరంగా లేట్ అవ్వడం తో బడ్జెట్ కూడా పెరిగిపోయాయి. అమర్ అక్బర్ ఆంథోని 40 కోట్లకు పైగానే బడ్జెట్ తో రూపొందగా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రంగా నిరాశ పరిచింది..
తర్వాత చేసిన లేటెస్ట్ మూవీ డిస్కో రాజా కూడా క్వాలిటీ పరంగా కాంప్రమైజ్ అవ్వకుండా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. ఇక ఇప్పుడు రవితేజ కంబ్యాక్ ఇవ్వడానికి సిద్ధం అవుతున్న సినిమా క్రాక్ కూడా ఇప్పుడు బడ్జెట్ పరంగా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యింది అని లేటెస్ట్ గా స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది.
రవితేజ గోపీచంద్ మలినేని, శృతిహాసన్, వరలక్ష్మీ లాంటి స్టార్ కాస్ట్ తో భారీ గా రూపొందిన ఈ సినిమాను ఠాగూర్ మధు నిర్మిస్తుండగా సినిమాను ముందుగా 25 కోట్ల లోపు బడ్జెట్ తో పూర్తీ చేయాలనీ అనుకున్నారని, కానీ సినిమా రూపొందుతున్న టైం లో బడ్జెట్ పెరిగి….
34 కోట్ల వరకు వెళ్ళింది అని సమాచారం. ఇదంతా లాక్ డౌన్ టైం వరకు జరిగిన బడ్జెట్ లెక్కలు కాగా తర్వాత మళ్ళీ బాలెన్స్ ఉన్న షూటింగ్ ని కూడా కంప్లీట్ చేయడం అలాగే సినిమా డిలే వలన అయిన ఫైనాన్స్ ఇబ్బందుల వలన మొత్తం మీద బడ్జెట్ ఇప్పుడు 38 కోట్ల రేంజ్ లో అయ్యింది అని అంటున్నారు ట్రేడ్ వర్గాల్లో… మరోసారి భారీ బడ్జెట్ గా మారిన రవితేజ కొత్త సినిమా ఇప్పుడు….
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఉన్న పరిస్థితులను తట్టుకుని ఈ బడ్జెట్ ని రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా ఎట్టి పరిస్థితులలో సంక్రాంతికే రాబోతుందని సమాచారం. దాంతో మిగిలిన సినిమాల పరిస్థితి ఎలా ఉన్నా రవితేజ కంబ్యాక్ మూవీ గా ఈ సినిమా నిలుస్తుందని యూనిట్ ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి మరి..