Home Uncategorized సూపర్ స్టార్ రాంపేజ్…3 ఏళ్లలో ఒకే ఒక్కడు…ట్విట్టర్ లో ఈ ఇయర్ రికార్డ్!

సూపర్ స్టార్ రాంపేజ్…3 ఏళ్లలో ఒకే ఒక్కడు…ట్విట్టర్ లో ఈ ఇయర్ రికార్డ్!

0

సోషల్ మీడియా లో అందరు హీరోల ఫ్యాన్స్ యాక్టివ్ గానే ఉంటారు కానీ ఈ మధ్య సూపర్ యాక్టివ్ గా ఉంటూ వస్తున్న ఫ్యాన్స్ మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ అనే చెప్పాలి, గత మూడేళ్ళుగా ఇయర్ కి ఒక హిట్ తో సూపర్ స్టార్ హాట్రిక్ ని కంప్లీట్ చేయగా ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియా లో తమదైన స్టైల్ లో రెచ్చిపోతూ వస్తున్నారు, దాంతో ప్రతీ ఇయర్ కొత్త రికార్డులు నమోదు చేస్తున్నారు.

దానికి ఈ రికార్డులే నిదర్శనం అని చెప్పొచ్చు. ప్రతీ ఇయర్ ట్విట్టర్ వాళ్ళు ఇయర్ ఎండ్ లో మొత్తం మీద ఇయర్ మొత్తం గమనించి ఏ హాష్ టాగ్ ఎక్కువగా ట్రెండ్ అయ్యింది, ఏ సినిమా గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు లాంటి వివరాలను రిలీజ్ చేస్తూ ఉంటుంది.

కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను, మహర్షి మరియు ఇప్పుడు సరిలేరు నీకెవ్వరు సినిమాలు ఒకటి తర్వాత ఒకటి మూడేళ్ళ నుండి ఇండియా లో ఎక్కువగా ట్వీట్స్ ని సొంతం చేసుకున్న సినిమాల లిస్టులో టాలీవుడ్ తరుపున నిలవడం విశేషం అని చెప్పొచ్చు.

2020 ఇయర్ కి గాను రిలీజ్ అయిన సినిమాల్లో ఎక్కువ ట్వీట్స్ పడ్డ మూవీస్ లో టాప్ 3 ప్లేసులలో దిల్ బేచారా, సూర్య నటించిన సూరరై పొట్రు తర్వాత మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సినిమాలు చోటు దక్కించుకున్నాయి. దాంతో హాట్రిక్ ని కంప్లీట్ చేశాడు మహేష్ బాబు. ఈ ఇయర్ సరిలేరు నీకెవ్వరు హాష్ టాగ్ ని మొదటి అర్ధభాగం వరకే ట్రెండ్ చేసిన ఫ్యాన్స్ తర్వాత ఎక్కువగా…

సర్కారు వారి పాట హాష్ టాగ్ నే ట్రెండ్ చేశారు. ఆల్ మోస్ట్ ఈ ఇయర్ లో 95 మిలియన్స్ వరకు ట్వీట్స్ ని వేయగా ఇదే మోస్ట్ ట్వీట్స్ ని సొంతం చేసుకున్న హాష్ టాగ్ అవుతుంది అనుకున్నా కేవలం రిలీజ్ అయిన మూవీస్ నే కౌంట్ చేస్తున్నాం అంటూ ట్విట్టర్ వాళ్ళు జాబితా రిలీజ్ చేశారు, బహుశా ఇయర్ ఎండ్ టైం కి మరో లిస్టు రిలీజ్ చేస్తారేమో చూడాలి.

Sarileru Neekevvaru 50 Days Centers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here