నాచురల్ స్టార్ నాని సుధీర్ బాబు ల కాంబినేషన్ లో మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో రూపొందిన సినిమా వి ది మూవీ ఈ ఇయర్ సమ్మర్ కానుకగా స్పెషల్ గా రిలీజ్ అవ్వాల్సిన సినిమానే అయినా కానీ కరోనా వలన రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ తర్వాత డైరెక్ట్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే, కాగా అమెజాన్ ప్రైమ్ ఏకంగా 34.5 కోట్ల రేటు పెట్టి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకోగా సినిమా…
సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ నుండి కంప్లీట్ నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది, కానీ సినిమా పై ఉన్న క్రేజ్ దృశ్యా మంచి వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి నెలలో పెట్టిన రేటు కి అయితే న్యాయం చేయలేదు. మొత్తం మీద సినిమా మొదటి నెలలో 1.5 మిలియన్స్ వరకు…
యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం రిలీజ్ అవ్వగా రెండో నెలలో సినిమా సాధించిన వ్యూస్ లెక్కలు కూడా రిలీజ్ అయ్యాయి. సినిమా రెండో నెలలో మొత్తం మీద 7 లక్షల 80 వేల దాకా వ్యూస్ ని అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకున్నట్లు సమాచారం. 2 నెలల్లో టోటల్ గా 2.28 మిలియన్ వ్యూస్ ని…
సొంతం చేసుకున్న వి మూవీ ఇప్పుడు మూడో నెలలో మరోసారి పర్వాలేదు అనిపించే విధంగా హోల్డ్ చేసి 4 లక్షల 15 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం. దాంతో మొత్తం మీద మూడు నెలలు పూర్తీ అయ్యే సరికి వి మూవీ కి అమెజాన్ ప్రైమ్ లో 2.69 మిలియన్స్ కి పైగా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుని ఓవరాల్ గా బాగానే హోల్డ్ చేసే విధంగా పెర్ఫార్మ్ చేసింది అని అంచనా వేయవచ్చు.
ఇక ఎంత కలెక్షన్స్ వచ్చి ఉంటాయి అన్నది అంచనా వేస్తె… అమెజాన్ ప్రైమ్ ఒక నెల సబ్ స్క్రిప్షన్ రేటు 129 కాగా అదే సినిమా ఒక టికెట్ రేటుగా భావిస్తే 2.69 మిలియన్ వ్యూస్ కి 129 టికెట్ రేటు తో 34.70 కోట్ల దాకా రికవరీ అయ్యి ఉండొచ్చని అంచనా వేయవచ్చు. ఈ లెక్కలు నిజం అనుకుంటే సినిమా జస్ట్ బిజినెస్ ని ఇప్పుడే తిరిగి ఇచ్చింది అని అంచనా వేయవచ్చు. 4 వ నెలలో సినిమా ద్వారా ప్రాఫిట్స్ అమెజాన్ కి దక్కే అవకాశం పుష్కలంగా ఉంది.