Home న్యూస్ రికార్డుల బెంచ్ మార్క్ ఆగట్లేదు….250 ఏంటి సామి అసలు!

రికార్డుల బెంచ్ మార్క్ ఆగట్లేదు….250 ఏంటి సామి అసలు!

0

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో రూపొందుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమాలోని ఇంట్రో టీసర్ లు యూట్యూబ్ రికార్డుల వేటలో దుమ్ము దులిపెస్తూ దూసుకు పోతున్నాయి. రీసెంట్ గా రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 36 మిలియన్స్ మార్క్ ని అందుకుని కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేయగా ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రీసెంట్ గా 34 మిలియన్స్ మార్క్ ని అందుకుని…

రామ్ చరణ్ ఇంట్రో టీసర్ నెలకొల్పిన రికార్డ్ ను బ్రేక్ చేయడానికి దూసుకు పోతున్నాడు, అదే టైం లో ఆల్ రెడీ ఆల్ టైం రికార్డులు నమోదు అయిన లైక్స్ అండ్ కామెంట్స్ విషయం లో కొత్త బెంచ్ మార్కులు కూడా నమోదు అవుతూ ఉండటం విశేషం అని చెప్పాలి. లైక్స్ పరంగా 1.2 మిలియన్ లైక్స్ మార్క్…

రీసెంట్ గా క్రాస్ చేసి కొత్త రికార్డ్ సృష్టించిన ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ టాలీవుడ్ లో ఇది వరకు ఎవ్వరూ టచ్ చేయని కామెంట్స్ రికార్డుల విషయం లో మాత్రం 1 లక్ష కామెంట్స్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించగా తర్వాత 1 లక్షా 50 వేలు, 2 లక్షల కామెంట్స్ మార్క్ ని అందుకుని కొత్త బెంచ్ మార్క్ ని…

సెట్ చేసి పెట్టగా ఇప్పుడు ఆ లీడ్ ని మరింత పెంచుతూ రీసెంట్ గా ఏకంగా 2 లక్షల 50 వేల కామెంట్స్ మార్క్ ని అందుకుని అల్టిమేట్ లీడ్ తో కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేశారు. ఇండియా లో టీసర్ ల విషయం లో మాస్టర్ సినిమా టీసర్ 3 లక్షల 67 వేలకి పైగా కామెంట్స్ తో టాప్ లో ఉండగా రెండో ప్లేస్ లో 2 లక్షల 50 వేల కామెంట్స్ మార్క్ ని క్రాస్ చేసి ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ టాప్ 2 ప్లేస్ ని సొంతం చేసుకుంది….

టాలీవుడ్ తరుపున లిస్టు లో ఉన్న ఏకైక సినిమాగా టీసర్ గా నిలిచింది. ఆర్ ఆర్ ఆర్ సినిమా ఇంట్రో టీసర్లే ఈ రేంజ్ లో రికార్డులు సృష్టిస్తే ఇక మెయిన్ టీసర్ ట్రైలర్ లు భీభత్సం సృష్టించడం ఖాయమని చెప్పొచ్చు. ఇక సినిమా షూటింగ్ మార్చ్ వరకు పూర్తీ అవుతుందని సినిమా వచ్చే ఇయర్ దసరా బరిలో నిలుస్తుంది అంటూ వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here