ఇండియా లో కరోనా ఎంటర్ అయిన తర్వాత మార్చ్ నుండి థియేటర్స్ అన్నీ కూడా మూత బడి ఉండగా సినిమాలు ఏవి కూడా థియేటర్స్ లో రిలీజ్ కి నోచుకోలేక ఉన్నంతలో మంచి ఆఫర్లు వస్తే డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని OTT లో రిలీజ్ అయ్యాయి. ఇలాంటి టైం లో ఇండియా లో జనాలను తిరిగి థియేటర్స్ వైపు రప్పించడానికి బాలీవుడ్ నుండి కానీ ఇతర ఇండస్ట్రీలో క్రేజ్ ఉన్న సినిమాలు ఏవి కూడా రంగం లోకి…
దిగని టైం లో హాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మూవీ ఆఫ్ 2020 క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో తెరకెక్కిన క్రేజీ మూవీ టెనెట్ ఇండియా లో రిలీజ్ ను సొంతం చేసుకుని ఉన్నంతలో లిమిటెడ్ గానే జనాలను తిరిగి థియేటర్స్ వైపు అడుగులు వేయించేలా చేసింది అని చెప్పాలి.
ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఇండియా వైడ్ గా సుమారు 1550 స్క్రీన్స్ లో ఈ సినిమా రిలీజ్ ను సొంతం చేసుకుంది. మొత్తం మీద వీకెండ్ లో 4.75 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సాధించిన ఈ సినిమా ఇప్పుడు మొదటి వారం పూర్తి అయ్యే టైం కి బాక్స్ ఆఫీస్ దగ్గర….
7.11 కోట్ల నెట్ కలెక్షన్స్ ని ఇండియా వైడ్ గా సొంతం చేసుకుంది. ఇవి మొత్తం మీద సాలిడ్ కలెక్షన్స్ అనే చెప్పాలి. తెలుగు లో సినిమా 32 లక్షల దాకా షేర్ ని వసూల్ చేయగా తమిళ్ లో 58 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసింది, ఇక కర్ణాటకలో సినిమా 55 లక్షల గ్రాస్ ని సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొత్తం మీద ఇండియా లో సినిమా రిలీజ్ అయిన స్క్రీన్స్ వైజ్ చూసుకుంటే…
యావరేజ్ కలెక్షన్స్ అనిపించినా నార్మల్ రిలీజ్ టైం అయ్యి ఉంటె 80 నుండి 90 కోట్ల రేంజ్ నెట్ కలెక్షన్స్ ని అందుకునేదే అయినా కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో సినిమా కి మంచి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వస్తుంది అని చెప్పాలి. ఇంకొన్ని మంచి సినిమాలు రిలీజ్ అయితే జనాలు మునుపటిలా థియేటర్స్ కి వచ్చే అవకాశం అయితే ఎంతైనా ఉందని చెప్పాలి…
Bro Gross entha undocchu?
12cr+ bro