Home న్యూస్ 2017 లో రావాల్సిన సినిమా….గువ్వగోరింక రివ్యూ!!….ఏంటి సామి ఇది!

2017 లో రావాల్సిన సినిమా….గువ్వగోరింక రివ్యూ!!….ఏంటి సామి ఇది!

0

ప్రస్తుతం ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య సినిమా వలన ప్రతీ ఒక్కరికీ హీరోగా మరింత సుపరిచయం అయ్యాడు సత్యదేవ్, హీరోగా కెరీర్ మొదలు పెట్టిన తొలి రోజుల్లో చేసిన సినిమాల్లో ఒకటైన గువ్వ గోరింక సినిమా ఎప్పుడో 2017 లోనే ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ అనేక ఇబ్బందుల వలన రిలీజ్ కి నోచుకోని ఈ సినిమా ఎట్టకేలకు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుంది…. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ విషయానికి వస్తే… సౌండ్ అలర్జీ ఉన్న హీరో సౌండ్ లేని మెషిన్ ని కనిపెట్టే ప్రాజెక్ట్ పై పి హెచ్ డి చేస్తూ ఉండగా తన ఫ్లాట్ పక్కనే హీరోయిన్ దిగుతుంది, చిన్నప్పటి నుండి సంగీతం అంటే పిచ్చి అయిన హీరోయిన్ ఎలాగైనా వయోలిన్ లో మాస్టర్స్ చేయాలనీ డిసైడ్ అవుతుంది…

సడెన్ గా ఆమెకి తన బావతో పెళ్లి ప్రపోజల్ రాగా తన స్టడీస్ అయ్యాక చేసుకుంటా అంటూ హైదరాబాదు వస్తుంది… ఇలా సంగీతం అంటే ఇష్టపడే హీరోయిన్ కి సౌండ్ అలర్జీ ఉన్న హీరో కి మధ్య లవ్ స్టొరీ ఎలా స్టార్ట్ అయ్యింది, మధ్యలో వచ్చిన అవాంతరాలు ఏంటి, అవి ఎలా సాల్వ్ అయ్యాయి అన్ని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

పెర్ఫార్మెన్స్ పరంగా సత్యదేవ్ తన రోల్ ని అద్బుతంగా చేశాడు, సౌండ్ ఇంజనీర్ గా తన నటన చాలా బాగా మెప్పిస్తుంది, ఇక హీరోయిన్ లుక్స్ పరంగా నెగటివ్ మార్కులే పడినా తన పాత్ర బాగుండటం తో పెర్ఫార్మెన్స్ బాగానే నటించి మెప్పించింది. ఇతర పాత్రలు కూడా ఉన్నంతలో పర్వాలేదు అనిపించాయి.

సినిమా కి మేజర్ ప్లస్ పాయింట్ అయిన సంగీతం సినిమా చూడటానికి బోర్ కొట్టిన పాటలు వినసొంపుగా ఉండటంతో చూసేలా చేయగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగానే మెప్పించింది, ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ బోరింగ్ గా అనిపించేలా ఉందని చెప్పాలి. ఇక సినిమాటోగ్రఫీ అదుర్స్ అనిపిస్తుంది.

ఆర్ట్ వర్క్ అద్బుతంగా ఉండటం, ఒక ఇంట్లో వేసిన డిఫెరెంట్ డిసైన్స్ లోనే సినిమా తెరకెక్కించినా కానీ బోర్ అనిపించలేదు… ఇక డైరెక్షన్ విషయానికి వస్తే అతి సాధారణ కథ ని ఏకంగా 2 గంటలకు పైగా నిడివితో తెరకెక్కించడం అంటే మాములు విషయం కాదు… డైరెక్టర్ అలా తెరకెక్కించినా ఏమాత్రం మెప్పించలేక పోయాడు.

హీరో కి సౌండ్ ఎలర్జీ అండ్ హీరోయిన్ కి సంగీతం అంటే పిచ్చి… ఇలాంటి పాయింట్ పై హిలేరియస్ ఎంటర్ టైనర్ తో లవ్ స్టొరీ ని చెప్పొచ్చు. కానీ డైరెక్టర్ రాసుకున్న కథ చాలా చిన్నది అవ్వడంతో 20 నిమిషాలకే సినిమా ఏంటి ఇంత స్లోగా రన్ అవుతుంది అని బోర్ కొట్టడం స్టార్ట్ అవుతుంది.

పాటలు కొంచం బాగున్నా కానీ కథలో ఏమాత్రం సత్తా లేక పోవడం తో 2 గంటల సినిమా ఎంతో లెంత్ ఉన్న సినిమాగా అనిపిస్తుంది. లీడ్ యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ పరంగా మెప్పించినా ఆడియన్స్ ఓన్ చేసుకునేంత ఫీల్ అయితే లేదు… ఓవరాల్ గా మంచి పాయింట్ ని అనుకున్న విధంగా చెప్పలేక పోయాడు డైరెక్టర్…

ఆడియన్స్ కొన్ని సీన్స్ వరకు ఎలాగోలా మెప్పించినా అది ఎక్కువ సేపు నిలవదు. మొత్తం మీద రొటీన్ మూవీస్ చూసే వాళ్ళు కూడా అతి కష్టం మీద సినిమాను పూర్తీ చేయాల్సి ఉంటుంది, ఇక కొత్తదనం కోరుకునే వారు దూరంగా ఉండటమే మంచింది, సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 1.5 స్టార్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here