Home TRP రేటింగ్ 8 కోట్లకు అమ్మితే…నాని వి మూవీ TRP రేటింగ్ ఇది!!

8 కోట్లకు అమ్మితే…నాని వి మూవీ TRP రేటింగ్ ఇది!!

0

నాచురల్ స్టార్ నాని కెరీర్ లో ప్రతిష్టాత్మక 25 వ సినిమా గా తెరకెక్కిన సినిమా వి ది మూవీ, నాని తో పాటు సుధీర్ బాబు మరో హీరోగా నటించిన ఈ సినిమా పై ఆడియన్స్ లో రిలీజ్ కి ముందు మంచి అంచనాలు ఉండేవి కానీ సినిమా సమ్మర్ రేసులో కరోనా వలన మిస్ చేసుకుని తర్వాత పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు సెప్టెంబర్ మొదట్లో డైరెక్ట్ రిలీజ్ ను సొంతం చేసుకుని ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కానీ సినిమా ఆడియన్స్ అంచనాలను అందుకోలేక పోయింది కానీ అమెజాన్ ప్రైమ్ లో సాలిడ్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని జెమినీ టీవీ వాళ్లకి రిలీజ్ కి ముందే సాలిడ్ రేటుకి అమ్మారు. 8 కోట్ల సాలిడ్ రేటు కి అమ్ముడైన వి మూవీ శాటిలైట్ రైట్స్…

   

సినిమా క్రేజ్ కి అద్దం పట్టినప్పటికీ కూడా సినిమా టెలివిజన్ ప్రీమియర్ ను రీసెంట్ గా వేయగా సినిమాకి వచ్చిన రేటింగ్ ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తుంది, మొత్తం మీద ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు ఈ సినిమా కి 6.82 రేటింగ్ ను సొంతం చేసుకుని షాక్ ఇచ్చింది ఈ సినిమా. ఇది మరీ తీసిపారేసే రేంజ్ రేటింగ్ కాకున్నా కానీ…

కొత్త సినిమా అవ్వడం డైరెక్ట్ రిలీజ్ అయినా కానీ కంప్లీట్ టెలివిజన్ ఆడియన్స్ కి చాలా దూరమే అవ్వడం తో టెలివిజన్ లో వేసినప్పుడు మంచి రేటింగ్ ని సినిమా సొంతం చేసుకుంటుంది అని అంతా భావించారు కానీ అలా జరగలేదు, పెట్టిన రేటు ప్రకారం చూసుకుంటే జస్ట్ యావరేజ్ అనిపించే రేటింగ్ ని సొంతం చేసుకున్న వి ది మూవీ, ఇతర బిగ్ మూవీస్ తో పోల్చితే..

కొంచం పర్వాలేదు అనిపించే రిజల్ట్ నే సాధించింది అని చెప్పాలి, ఇతర థ్రిల్లర్ మూవీస్ ఇంతకంటే బెటర్ రేటింగ్ లను సాధించాయి. ఇక రిపీట్ టెలికాస్ట్ లో సినిమా ఇలాంటి రిజల్ట్ నే సొంతం చేసుకుంటే ఛానెల్ కి రెండో సారి లేదా మూడో సారి టెలికాస్ట్ టైం కి ప్రాఫిట్స్ దక్కే అవకాశం ఉంటుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here