నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్ లో సింహా లెజెండ్ మూవీస్ తర్వాత హాట్రిక్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా తర్వాత బాలయ్య కొత్త సినిమా ఏది కూడా అఫీషియల్ గా ఇంకా కన్ఫాం చేయలేదు కానీ బాలయ్య అప్ కమింగ్ మూవీస్ పై మాత్రం రోజుకో టాక్ గట్టిగానే వినినిపిస్తుంది టాలీవుడ్ లో… చాలా మంది డైరెక్టర్ లతో బాలయ్య సినిమాల గురించి…
టాక్ ఉన్నా కానీ ఇప్పుడు ఓ ప్రాజెక్ట్ మాత్రం ఆసక్తిని రేపుతుంది, టాలీవుడ్ లో కందిరీగ సినిమాతో సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చిన సంతోష్ శ్రీనివాస్ తర్వాత ఎన్టీఆర్ తో రభస సినిమాతో డిసాస్టర్ ఇచ్చి వెంటనే కనుమరుగు అయ్యాడు, తర్వాత ఆల్ మోస్ట్ 6 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు….
బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ సినిమా తో సంక్రాంతి బరిలో సందడి చేయబోతున్న ఈ డైరెక్టర్ తన అప్ కమింగ్ మూవీ ని బాలయ్యతో చేయబోతున్నాడు అన్న టాక్ గట్టిగా వినిపిస్తుంది, కాగా సినిమా టైటిల్ మాత్రం పవర్ ఫుల్ గా పెట్టుకోవడం తో నిజం అయితే…
బాగుణ్ణు అంటూ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు… సినిమా కి టైటిల్ గా “బలరామయ్య బరిలోకి దిగితే” అంటూ మాస్ టైటిల్ ని పెట్టుకున్న ఈ సినిమా కథ మొత్తం ఊరిలో జరిగే కథ అని అంటున్నారు. బాలయ్య ఊరి పెద్దగా కనిపిస్తారు అంటూ చెప్పుకుంటున్నారు. బాలయ్య ఈ కథ విన్న తర్వాత కొన్ని మార్పులు చెప్పారని అది పూర్తీ అయితే సినిమా అఫీషియల్ గా కన్ఫాం చేసే…
అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు… ఎన్టీఆర్ తో డిసాస్టర్ రిజల్ట్ తర్వాత ఇప్పుడు అల్లుడు అదుర్స్ తో వస్తున్న సంతోష్ శ్రీనివాస్ ఆ సినిమా తో అంచనాలను తట్టుకుని నిలబడి ఈ కథ మార్పులు కూడా సరిగ్గా సెట్ అయితే బాలయ్య తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. మరి ఎం జరుగుతుందో చూడాలి మరి.