Home గాసిప్స్ ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమా కంప్లీట్….సాలిడ్ OTT ఆఫర్!!

ఫస్ట్ సినిమా రిలీజ్ కాకముందే రెండో సినిమా కంప్లీట్….సాలిడ్ OTT ఆఫర్!!

1128
0

మెగా ఫ్యామిలీ నుండి హీరోగా లాంచ్ అవుతున్న కొత్త కుర్రాడు పంజా వైష్ణవ్ తేజ్ ముందుగా ఉప్పెన సినిమా తో బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ రేసులో సందడి చేయాల్సి ఉన్నా కానీ కరోనా వలన అది కుదరలేదు. సినిమా అప్పటి నుండి పోస్ట్ పోన్ అవుతూ రాగా డైరెక్ట్ రిలీజ్ కి ఆఫర్లు వచ్చినా కానీ నో చెబుతూ వచ్చ్సిన టీం ఎట్టకేలకు ఇక థియేటర్స్ లోనే సినిమా ను రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అవ్వగా…

ఈ గ్యాప్ లో హీరోగా సెకెండ్ మూవీ ని కూడా కమిట్ అవ్వడం ఆ సినిమా షూటింగ్ ను కూడా కంప్లీట్ చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్న ఈ సినిమా నే ఇప్పుడు వైష్ణవ్ తేజ్ ఫస్ట్ మూవీ గా రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

15 కోట్ల బడ్జెట్ లో 45 రోజుల వర్కింగ్ లో కంప్లీట్ అయిన ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ తో రకుల్ ప్రీత్ సింగ్ నటించగా క్రిష్ తక్కువ రోజుల్లోనే షూటింగ్ ను పూర్తి చేయగా సినిమా కి కొండపాలెం అనే టైటిల్ ను అకుంటున్నారు. ఇక సినిమా ని డైరెక్ట్ రిలీజ్ చేయాలనీ ముందే అనుకున్నారు టీం.

ఇప్పుడు ఆ విధంగా ఆఫర్లు కూడా సాలిడ్ గానే వస్తున్నాయని సమాచారం… లీడింగ్ OTT యాప్స్ ఈ సినిమాను కొనడానికి సిద్ధంగా ఉన్నాయట. రేటు కూడా 16 కోట్ల రేంజ్ లో రేటు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాయని టాక్ వస్తుంది. అంటే సినిమా బడ్జెట్ మొత్తం కేవలం డిజిటల్ రిలీజ్ తోనే రికవరీ అవ్వడమే కాకుండా కొంచం ప్రాఫిట్ కూడా ఇక్కడే దక్కే చాన్స్ ఉంది.

ఇక శాటిలైట్ రైట్స్ అండ్ హిందీ డబ్బింగ్ రైట్స్ తో సినిమాకి మరింత ప్రాఫిట్ దక్కే అవకాశం ఉంది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యాక సినిమా టీసర్ ని రిలీజ్ చేసి తర్వాత రేటు పెరిగితే ఆ రేటు కి లేదా ఈ రేటు ని ఫైనల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఇక ఉప్పెన సినిమా కుదిరితే ఫిబ్రవరిలో లేదా ఏప్రిల్ లోనే రిలీజ్ అవుతుందని సమాచారం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here