2020 లో పాండమిక్ టైం లో పరిస్థితులు బాగున్న దేశాలలో రిలీజ్ ను కన్ఫాం చేసుకుని షాక్ ఇచ్చిన మోస్ట్ వాంటెడ్ మూవీ టెనెట్. క్రిస్టఫర్ నోలన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉండగా కరోన టైం లో రిలీజ్ అవ్వడం తో అనుకున్న టార్గెట్ ని అందుకోలేక పోయిన ఈ సినిమా మొత్తం ఓవర్సీస్ ఫారన్ రిలీజ్ లో ఫ్లాఫ్ మూవీ గానే పరుగును ముగించాల్సి రాగా…
ఇండియా లో డిసెంబర్ మొదటి వారంలో థియేటర్స్ అన్నీ రీ ఓపెన్ అయ్యాక రిలీజ్ అయిన మొదటి పెద్ద మూవీగా వచ్చిన ఈ సినిమా హైప్ ని మ్యాచ్ చేసేలా టాక్ అద్బుతంగా వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ మాత్రం అనుకున్న రేంజ్ లో సొంతం చేసుకోలేదు.
మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వీకెండ్ లో 4.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ని, మొదటి వారం మొత్తం మీద 7.11 కోట్ల నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు…
పరుగు పూర్తీ అయ్యే టైం కి సినిమా టోటల్ గా 12 కోట్ల లోపు నెట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ పరుగును పూర్తీ చేసుకుంది. ఇండియా లో సినిమా బిజినెస్ ఏమి లేకుండా పెర్సేంటేజ్ బేస్ మీద రిలీజ్ అవ్వడం తో ఎవ్వరికీ పెద్దగా నష్టాలు అయితే రాలేదు అని చెప్పాలి. మామూలు టైం లో రిలీజ్ అయ్యి ఉంటె సినిమా భారీ వసూళ్ళని సొంతం చేసుకుని ఉండేది కానీ…
ఆల్ రెడీ డిజిటల్ ప్రింట్ రావడం, అప్పుడే థియేటర్స్ రీ ఓపెన్ చేయడంతో జనాలు థియేటర్స్ కి పెద్ద ఎత్తున రాలేదు. దాంతో అది ఎఫెక్ట్ గా మారి సినిమా పరుగు పై ఇంపాక్ట్ చూపింది. మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండియా లో 7 కోట్ల మేర షేర్ ని సాధించి పరుగును ముగించింది, తెలుగు వర్షన్ 1.4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంచనా..