తెలుగు సినిమాలకు తెలుగు రాష్ట్రాల తర్వాత బిగ్గెస్ట్ మార్కెట్ కర్ణాటక, అక్కడ లోకల్ స్టార్ లకు ఉన్నంత క్రేజ్ మన హీరోలకు అక్కడ ఉంది, అదే టైం లో అక్కడ స్టార్స్ కూడా అడపాదడపా మన దగ్గర సినిమాలు చేస్తూ ఉండగా కొందరు ఇక్కడ సినిమాలను రిలీజ్ చేస్తూ మార్కెట్ ఎక్స్ పాన్షన్ చేసుకుంటున్నారు. ఉపేంద్ర, సుదీప్, యష్ ఇలా ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళు కొందరు ఉండగా ఇప్పుడు అక్కడ భారీ క్రేజ్ ఉన్న…
మరో హీరో టాలీవుడ్ లో అడుగు పెట్టడానికి సిద్ధం అవుతున్నాడు, అతనే దర్శన్, ఫ్యాన్స్ డి బాస్ అంటూ ముద్దుగా పిలుచుకునే ఈ హీరో 2019 లోనే టాలీవుడ్ లో కురుక్షేత్రం సినిమాను డబ్ చేసి రిలీజ్ చేశారు కానీ ఇక్కడ పెద్దగా మార్కెట్ చేయకపోవడం తో ఆ సినిమా ఆశించిన విధంగా సక్సెస్ కాలేదు.
ఇలాంటి టైం లో ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ రాబర్ట్ ను తెలుగు లో కూడా రిలీజ్ చేయలాని డిసైడ్ అవ్వగా రీసెంట్ గా సినిమా టీసర్ ను కూడా తెలుగు లో రిలీజ్ చేశారు. టీసర్ చూస్తుంటే మాస్ ఎలిమెంట్స్ అండ్ విజువల్స్ గ్రాండ్ గా ఉండి మెప్పించగా తెలుగు డబ్బింగ్ టీసర్ వరకు అయితే…
బాగానే మెప్పించింది, మన తెలుగు కమర్షియల్ మూవీస్ నే పోలి ఉన్న సీన్స్, ఫైట్స్ మరియు బ్యాగ్రౌండ్ స్కోర్ పక్కా మాస్ కమర్షియల్ మూవీకి ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇక హీరో మన వాళ్లకి పెద్దగా పరిచయం లేని వారు కాబట్టి తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్నది ఆసక్తి కరంగా మారింది. టీసర్ మట్టుకు అయితే క్వాలిటీ అండ్ మాస్ ఎలిమెంట్స్ తో కమర్షియల్ గా రీచ్ ను…
సొంతం చేసుకునే అవకాశం ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నడ తో పాటు తెలుగు లో మార్చ్ 11 న రిలీజ్ కాబోతుంది. తెలుగు లో ఆ డేట్ కి పోటి తీవ్రంగా ఉంది, మరి ఆ పోటి లో ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించగలుగుతుందో చూడాలి. ఇక టీసర్ కి ఫస్ట్ 24 గంటల్లో ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.