Home న్యూస్ నితిన్ “చెక్” ట్రైలర్ రివ్యూ…కుమ్మింది ట్రైలర్…హిట్ పక్కా!!

నితిన్ “చెక్” ట్రైలర్ రివ్యూ…కుమ్మింది ట్రైలర్…హిట్ పక్కా!!

0

  యూత్ స్టార్ నితిన్ లాస్ట్ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు, తర్వాత రంగ్ దే సినిమా తో సందడి చేయాలి అనుకున్న కరోనా వలన అది కుదరలేదు. ఇప్పుడు సమ్మర్ కానుకగా ఆ సినిమా రాబోతుండగా కరోనా తర్వాత నితిన్ మెచ్చి చేస్తున్న ఎక్స్ పెరిమెంటల్ మూవీ చెక్. టాలెంటెడ్ డైరెక్టర్ చంద్ర శేఖర్ యేలేటి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ సినిమా రిలీజ్ డేట్ ఇప్పుడు మారి…

ఫిబ్రవరి 26 న ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా లాంచ్ చేశారు. ట్రైలర్ లో నితిన్ ని ఒక టెర్రరిస్ట్ గా దేశద్రోహిగా డైలాగులతో చూపెట్టారు. అసలు ఏ కేసు మీద నితిన్ ని అరెస్ట్ చేశారు దాని వెనక రీజన్ ఏంటి అనేది సినిమా కథ కాగా…

జైలులో ఎంటర్ అయిన హీరో చెస్ ని ఆడటం మొదలు పెడతాడు, అటు చదరంగం క్రీడా పరంగా ఇటు జైలులో కొందరు వ్యక్తులతో మైండ్ గేమ్ ఆడటం మొదలు పెట్టిన హీరో తను అనుకున్నది ఎలా సాధించాడు అనే ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే బేస్ స్టొరీ తో చెక్ మూవీ రూపొందింది.

ట్రైలర్ మట్టుకు సస్పెన్స్ థ్రిల్ చేస్తూ మెప్పించగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది. కొన్ని ఫైట్స్ కూడా సినిమాలో పెట్టారు, రకుల్ ప్రీత్ సింగ్ అండ్ ప్రియా ప్రకాష్ వారియర్ ల స్క్రీన్ స్పేస్ తక్కువే ఉండగా రకుల్ లుక్స్ పరంగా మునుపటిలా మెప్పించలేదు. ప్రియా ప్రకాష్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. మొత్తం మీద ట్రైలర్ మట్టుకు ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉందని చెప్పాలి. ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నందుకు….

నితిన్ ని కూడా మెచ్చుకోవాల్సిందే. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఇంప్రెస్ చేస్తే ఇలాంటి డిఫెరెంట్ జానర్ మూవీస్ మరిన్ని టాలీవుడ్ లో వచ్చే అవకాశం ఉంటుంది. ఇక సినిమాతో నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర భీష్మ విజయాన్ని కంటిన్యూ చేయాలని కోరుకుందాం, ఇక ట్రైలర్ కి ఎలాంటి రెస్పాన్స్ 24 గంటల్లో సొంతం అవుతుందో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here