టాలీవుడ్ లో మినిమమ్ గ్యారెంటీ డైరెక్టర్ లలో గోపీచంద్ మలినేని కూడా ఒకరని చెప్పొచ్చు. ఒక్క విన్నర్ సినిమా తప్పిస్తే…చేసిన మిగిలిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ప్రదర్శన కనబరిచాయి. రవితేజ కి కీలక టైం లో మాస్ కంబ్యాక్ ఇచ్చిన డైరెక్టర్ గా గోపీచంద్ ని చెప్పుకోవచ్చు. డాన్ శీను, బలుపు ఇప్పుడు క్రాక్ మూవీస్ తో హాట్రిక్ హిట్స్ ని రవితేజ కి ఇచ్చారు.
అలాంటి డైరెక్టర్ కి క్రాక్ సినిమా నిర్మాతకి మధ్య రెమ్యునరేషన్ విషయంలో ఇప్పుడు గొడవ జరుగుతుందని సమాచారం. ఆ గొడవ ఇప్పుడు డైరెక్టర్స్ అసోసియేషన్ కి కూడా వెళ్లి ఇండస్ట్రీ పెద్దల నడుమ సెటిల్ చేసుకునే స్టేజ్ కి వెళ్ళింది అని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే సినిమా కి గాను గోపీచంద్ కి అందాల్సిన రెమ్యునరేషన్ లో 50 లక్షలను నిర్మాత ఠాగూర్ మధు పెండింగ్ లో పెట్టారట. రీసెంట్ గా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ఆ బాలెన్స్ ని క్లియర్ చేయమని అడగ్గా సినిమా మీ వల్లే బడ్జెట్ ఎక్కువ అయింది…
అదుపు తప్పి ఓవర్ బడ్జెట్ అయింది, అందుకని ఆ రెమ్యునరేషన్ ఇవ్వను అని చెప్పేశారట. దాంతో బడ్జెట్ పెరిగింది వాస్తవమే కానీ సినిమా రిజల్ట్ కూడా చూడాలి కదా అని ఎన్ని చెప్పినా ససేమీరా ఆ డబ్బు ఇవ్వనని ప్రొడ్యూసర్ చెప్పడం తో ఇక డైరెక్టర్స్ అసోషియేషన్ లో నిర్మాత మీద కంప్లైంట్ ఇచ్చారట డైరెక్టర్ గోపీచంద్ మలినేని. ఇది వరకు కూడా అర్జున్ సురవరం టైం లో….
నిర్మాత పై ఇలాంటి కంప్లైంట్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కొత్త సినిమా విషయం లో కూడా ఇలానే జరగడం తో చర్చలు మరింతగా అవుతున్నాయి. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో టాలీవుడ్ పెద్దలు ఎవరి వైపు నుండి తీర్పు ఇస్తారో అన్నది ఆసక్తిగా మారింది… సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డులు సృష్టిస్తున్న వేల ఇలాంటి గొడవలు జరగడం కొంత ఇబ్బంది కలిగించే విషయమే అని చెప్పాలి.