Home న్యూస్ హాట్రిక్ డిసాస్టర్లు…అయినా 2 ఏరియాల్లో 20 కోట్లు…ఇదీ మాస్ పవర్ అంటే!

హాట్రిక్ డిసాస్టర్లు…అయినా 2 ఏరియాల్లో 20 కోట్లు…ఇదీ మాస్ పవర్ అంటే!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందుతున్న హాట్రిక్ మూవీ BB3 పై అంచనాలు భారీ లెవల్ లో ఉన్న విషయం తెలిసిందే. ఇటు బాలయ్య అటు బోయపాటి శ్రీను లు ఈ మధ్య కాలంలో చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నిరాశ పరిచినా కానీ వీళ్ళ కాంబోలో ఇప్పుడు రూపొందుతున్న హాట్రిక్ మూవీ పై మాత్రం అంచనాలు మరో లెవల్ లో ఉండటం విశేషం అనే చెప్పాలి.

దానికి ముఖ్య కారణం వీళ్ళ కాంబోలో ఇది వరకు వచ్చిన రెండు సినిమాలు ఊహకందని విజయాలను నమోదు చేయడమే కారణం అని చెప్పాలి. ఆ రేంజ్ హిట్స్ తర్వాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న హాట్రిక్ మూవీ పై అంచనాలు మరో లెవల్ లో ఉండగా ఇప్పుడు…

ఇద్దరి ప్రీవియస్ మూవీస్ రిజల్ట్ లను పక్కకు పెట్టి మరీ అద్బుతమైన బిజినెస్ ఆఫర్స్ ని ఈ సినిమా కి ఇస్తున్నారట. టాలీవుడ్ లీడింగ్ ప్రొడ్యూసర్ కం డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు ఈ సినిమా 2 కీలక ఏరియాల హక్కులను మంచి రేటు చెల్లించి సొంతం చేసుకున్నారట.

నైజాం మరియు వైజాగ్ ఏరియాలు రెండూ కలిపి ఏకంగా 20 కోట్ల రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారట. బాలయ్య కెరీర్ లో ఇది హైయెస్ట్ బిజినెస్ గా చెప్పుకుంటున్నారు…ఇది వరకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా నైజాంలో 9 కోట్లు వైజాగ్ లో 5 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకుంది… కానీ ఇప్పుడు సాలిడ్ రేటు తో ఈ రెండు ఏరియాల బిజినెస్ లు జరగగా..

మిగిలిన ఏరియాల బిజినెస్ లు కూడా ఒకటి తర్వాత ఒకటి కంప్లీట్ అవుతున్నాయని సమాచారం. ఈ లెక్కన సినిమా రిలీజ్ కి టైం ఉండగానే టోటల్ బిజినెస్ ను కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మే 28 న క్లాష్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here