అల్లరి నరేష్ బాక్స్ ఆఫీస్ దగ్గర తనదైన రేంజ్ లో హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది, బాక్స్ ఆఫీస్ దగ్గర చేసిన సినిమా చేసినట్లు నిరాశ పరిచే రిజల్ట్ నే ఇస్తూ వస్తుంది ఇన్నాళ్ళుగా, సుడిగాడు తర్వాత ఇప్పటి వరకు ఒక్క క్లీన్ హిట్ ని కూడా సొంతం చేసుకోలేక పోయాడు అల్లరోడు, రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన రొటీన్ కామెడీ ఎంటర్ టైనర్ అయిన బంగారు బుల్లోడు కూడా ఏమాత్రం అంచనాలను అందుకోలేదు.
దాంతో ఇప్పుడు మరింత ప్రెజర్ అప్ కమింగ్ అయిన నాంది సినిమా పై పడింది. కానీ ఈ సినిమా పై ఆడియన్స్ లో ఒక మంచి ఇంప్రెషన్ అయితే ఉందని చెప్పాలి. డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీ అవ్వడం అల్లరి నరేష్ ఈ సినిమాలో డిఫెరెంట్ రోల్ చేస్తూ ఉండటం తో…
కచ్చితంగా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోవచ్చు. దాంతో హిట్ కొట్టే ఛాన్స్ ఉందని చెప్పాలి. ఇక సినిమా మొత్తం మీద సాధించిన బిజినెస్ ను గమనిస్తే.. నైజాం లో 1కోటి, సీడెడ్ లో 30 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 1.2 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా..
రెండు తెలుగు రాష్ట్రలో మొత్తం మీద 2.5 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 2.7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది. దాంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా క్లీన్ హిట్ గా నిలవాలి అంటే 3 కోట్ల రేంజ్ లో షేర్ ని సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా సాధిస్తే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉంటుంది.
సినిమా కి పర్వాలేదు అనిపించే బజ్ ఉంది కాబట్టి సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం అయితే ఉందని చెప్పాలి. ఇక సినిమా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని యు/ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకోగా టోటల్ లెంత్ 2 గంటల 26 నిమిశాలతో వస్తుంది. మరి ఈ సినిమాతో అల్లరోడు హిట్ కొట్టాలని మనమూ కోరుకుందాం…