Home న్యూస్ ఆ ఒక్కటి అడక్కు: 4.50 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది మాత్రం ఇదే!

ఆ ఒక్కటి అడక్కు: 4.50 కోట్ల టార్గెట్….1st వీక్ లో వచ్చింది మాత్రం ఇదే!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సమ్మర్ లో వచ్చిన సినిమాలు పెద్దగా జోరుని అయితే చూపించడం లేదు. లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన అల్లరి నరేష్(Allari Naresh) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆ ఒక్కటీ అడక్కు(Aa Okkati Adakku Movie) మిక్సుడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నా వీకెండ్ వరకు పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది.

కానీ వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మాత్రం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర స్లో డౌన్ అయింది…పెద్దగా హోల్డ్ ని చూపించ లేక పోయిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ బ్రేక్ ఈవెన్ కి దూరంగానే ఆగేలా చేశాయి అని చెప్పాలి. మొత్తం మీద ఆ ఒక్కటీ అడక్కు 6వ రోజున…

తెలుగు రాష్ట్రాల్లో 10 లక్షల రేంజ్ లో షేర్ ని అందుకుంటే 7వ రోజున 9 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా వరల్డ్ వైడ్ గా 10 లక్షల రేంజ్ లో షేర్ ని 25 లక్షల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు మొదటి వారంలో వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే….

Aa Okkati Adakku 7 Days Total WW Collections Report
👉Nizam – 1.00CR
👉Total AP: 1.26CR~
Total AP-TG Collections:- 2.26CR~(4.80CR~ Gross)
👉KA+ROI+OS: 0.34CR~
Total WW Collections- 2.60CR(5.85CR~ Gross)

మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 4.50 కోట్ల రేంజ్ లో వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా మొదటి వారంలో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఇంకా 1.9 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక రెండో వారంలో ఎలాంటి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here