Home న్యూస్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా…4.5 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే…టోటల్ బిజినెస్ ఇది….నిర్మాతకి లాభమా...

30 రోజుల్లో ప్రేమించడం ఎలా…4.5 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే…టోటల్ బిజినెస్ ఇది….నిర్మాతకి లాభమా నష్టమా?

0

బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మొత్తం మీద టాక్ మరీ అనుకున్న విధంగా రాకున్నా కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచి పరుగును ముగించింది. సినిమాలో ఒక్క సాంగ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో అది బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడంలో హెల్ప్ చేసింది అని చెప్పాలి.

ఇక సినిమా వల్ల నిర్మాతకి మొత్తం మీద ఎంత లాభం దక్కింది లాంటి విశేషాలను గమనిస్తే… సినిమా కి ఓవరాల్ గా అయిన బడ్జెట్ మొత్తం మీద 4.5 కోట్ల రేంజ్ లో పెట్టగా సినిమా కి బాక్స్ ఆఫీస్ దగ్గర థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద 4.4 కోట్ల బిజినెస్ జరిగింది..

ఇక సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను ఆహా వాళ్ళు 2 కోట్ల రేటు చెల్లించి సొంతం చేసుకోగా తెలుగు శాటిలైట్ రైట్స్ ని 2.5 కోట్ల రేటు కి అమ్మారు, ఇక హిందీ డబ్బింగ్ రైట్స్ ని 1.4 కోట్ల రేటు కి అమ్మగా మ్యూజిక్ రైట్స్ కింద సినిమా కు 40 లక్షల రేటు సొంతం అయింది.

ఇక సినిమా తమిళ్ అండ్ మలయాళం డబ్ కి కూడా బిజినెస్ జరగగా ఆ రేటు 1.2 కోట్ల దాకా ఉందని సమాచారం. దాంతో మొత్తం మీద సినిమా కి థియేట్రికల్ బిజినెస్ 4.4 కోట్ల రేటు సొంతం అవ్వగా నాన్ థియేట్రికల్ బిజినెస్ మొత్తం మీద 7.5 కోట్ల దాకా బిజినెస్ ను ఈ సినిమా సొంతం చేసుకుందని సమాచారం. దాంతో టోటల్ బిజినెస్ 11.9 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా..

దాంతో నిర్మాతకి సినిమా ద్వారా ఏకంగా 7 కోట్లకు పైగా సాలిడ్ ప్రాఫిట్ లభించింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా 4.4 కోట్ల బిజినెస్ కి సినిమా 7.24 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని మొత్తం మీద 2.44 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుంది. కంప్లీట్ గా సినిమా ని కొన్న వాళ్ళందరికీ సినిమా సాలిడ్ లాభాలను ఇచ్చింది అని చెప్పాలి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here