యూత్ స్టార్ నితిన్ చంద్రశేఖర్ ఏలేటి ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ చెక్ ఆడియన్స్ ముందుకు 875 థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రీసెంట్ గా రిలీజ్ అయింది, నితిన్ సినిమా అంటే యూత్ సబ్జెక్ట్ తో మంచి కామెడీ సీన్స్ తో ఎంటర్ టైనర్ గా ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి, చాలా డిఫెరెంట్ గా ఈ సారి చెక్ అంటూ ఎక్స్ పెరిమెంటల్ మూవీ తో వచ్చిన నితిన్ ఎంతవరకు ఆకట్టుకున్నాడో తెలుసుకుందాం పదండీ..
ముందుగా కథ పాయింట్ కి వస్తే… టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కారణంగా హీరో పై దేశద్రోహిగా భావించి ఉరిశిక్ష విధిస్తారు, దాంతో హీరో ఆ కేసు నుండి తప్పించుకోవడానికి చెక్ గేమ్ ను ఎంచుకుంటాడు, మరి ఆ గేమ్ తో ఉరిశిక్ష ఎలా తప్పించుకున్నాడు, అసలు హీరో చేసిన నేరం ఏంటి…
ఆ నేరం వెనుక ఎవరు ఉన్నారు, అసలు ఉరిశిక్ష పడ్డ హీరో తప్పించుకున్నాడా లేదా అన్న ట్విస్ట్ లు అన్నీ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నితిన్ రెగ్యులర్ మూవీస్ లో లాగా కాకుండా ఈ సారి సటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు.
కొన్ని సీన్స్ లో బాగా నటించాడు, హీరోయిజం ఎలివేట్ అయ్యే సీన్స్ కొన్ని బాగా వచ్చాయి కూడా… ఇక హీరోయిన్స్ ఇద్దరూ జస్ట్ ఓకే అనిపించుకున్నారు, రకుల్ ప్రీత్ సింగ్ ఫేస్ లో ఇదివరకు కళ లేదు, ప్రియా ప్రకాష్ వారియర్ జస్ట్ ఓకే… ఇక మిగిలిన యాక్టర్స్ అందరూ ఉన్నంతలో తమ వరకు బాగానే నటించి మెప్పించారు, సంగీతం సినిమాలో ఒక సాంగ్ మాత్రమే ఉంది…
అది ఓకే అనిపించే విధంగా ఉండగా బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా మెప్పించింది, కొన్ని వీక్ సీన్స్ ని కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేశారు. ఇక డైలాగ్స్ బాగున్నాయి, సినిమాటోగ్రఫీ అదిరిపోయింది, జైలులోనే ఎక్కువ సీన్స్ ఉన్నా బాగా తీశారు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
ఇక డైరెక్షన్ విషయానికి వస్తే చంద్రశేఖర్ ఏలేటి మరోసారి డిఫెరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకున్నా పూర్తిగా న్యాయం చేయలేక పోయారు, సినిమాలో పార్టు పార్టులుగా కొన్ని సీన్స్ బాగా మెప్పిస్తాయి కానీ స్క్రీన్ ప్లే వీక్ గా ఉంది.. సింపుల్ గా చెప్పాలి అంటే… చెస్ ఆడటం చూడటం వేరు,
ఆడేవాళ్ళకి… బాగానే అనిపించవచ్చు కానీ చూసేవాళ్లకి ఒక టైం దాటాక కొంచం బోర్ కొడుతుంది, మళ్ళీ క్లైమాక్స్ కి వచ్చే సరికి ఎవరు గెలుస్తారా అనిపిస్తుంది, ఈ సినిమా కూడా అంటే… మొదలు అవ్వడం మంచి ఎత్తులతో మొదలు అయినా… మధ్యలో స్లో అవుతుంది…తిరిగి ప్రీ ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ వరకు…
పుంజుకుని మళ్ళీ స్లో అయ్యి క్లైమాక్స్ మళ్ళీ పుంజుకుంటుంది…. సో ఇది చూసేవాళ్ల ఒపినీయన్ మీద బేస్ అయ్యి ఉంటుంది అని చెప్పాలి… గేమ్ లో ఎత్తుఫల్లాలు ఎలా ఉంటాయో చంద్రశేఖర్ ఏలేటి కూడా సినిమాను అలానే తెరకెక్కించారు… ఇక ఇలాంటి డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడేవాళ్ళకి సినిమా ఈజీగా ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది…
రెగ్యులర్ మూవీస్ చూసేవాళ్లకి మాత్రం కొంచం ఇబ్బంది కలిగించినా వాళ్ళు కూడా కొంచం ఓపికతో చూస్తె పర్వాలేదు చూడొచ్చులే అనిపించే విధంగా సినిమా ఉంటుంది.. సో థియేటర్స్ కి వెళ్ళే ముందే ఇది నార్మల్ కమర్షియల్ మూవీ కాదు అని మెంటల్ గా ఫిక్స్ అయ్యి…
వెళితే సినిమా కొంచం బోర్ కొట్టించినా కొన్ని మంచి సీన్స్ తో ముగిసే టైం కి బాగానే అనిపిస్తుంది… నితిన్ అండ్ చంద్రశేఖర్ ఏలేటి మరీ అనుకున్న రేంజ్ లో మెప్పించక పోయినా నిరాశ అయితే పరచలేదు…. సో మొత్తం మీద సినిమాకి మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్…