బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలానికి అల్లరోడు మంచి విజయం తో కంబ్యాక్ ని సొంతం చేసుకున్నాడు, తన లేటెస్ట్ మూవీ నాంది బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా జోరు చూపి మంచి హోల్డ్ తో బ్రేక్ ఈవెన్ అయ్యాక కూడా ఎక్కడా స్లో డౌన్ అవ్వకుండా పరుగును కొనసాగించగా మొదటి వారం తర్వాత సినిమా కి కొత్త సినిమాల నుండి…
పోటి ఎదురు అయినా కానీ వీకెండ్ లో సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న సినిమా తర్వాత వర్కింగ్ డేస్ లో కొంచం స్లో అయినా మొత్తం మీద అప్పటికే సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం తో సూపర్ హిట్ టాగ్ తో మొత్తం మీద 2 వారాలను పూర్తీ చేసుకుంది.
సినిమా మొదటి వారం మొత్తం మీద 3.47 కోట్ల షేర్ ని సొంతం చేసుకోగా రెండో వారం కొత్త సినిమాల నుండి పోటి ఉన్నప్పటికీ కూడా సినిమా మొత్తం మీద 1.45 కోట్ల షేర్ ని సొంతం చేసుకుని రెండో వారాన్ని సూపర్ స్ట్రాంగ్ గా ముగించింది.
ఇక సినిమా టోటల్ గా 2 వారాలు పూర్తీ అయ్యే టైం కి వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
👉Nizam: 1.77Cr
👉Ceeded: 58L
👉UA: 55L
👉East: 40L
👉West: 28L
👉Guntur: 40L
👉Krishna: 43L
👉Nellore: 23L
AP-TG Total:- 4.64CR (8.69Cr Gross~)
KA+ROI – 10L
OS – 18L
Total WW: 4.92CR(9.15Cr Gross)
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 14 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క. సినిమా సూపర్ స్ట్రాంగ్ గా రెండో వారం పోటి ని తట్టుకుని నిలబడి సత్తా చాటుకుంది.
సినిమాను టోటల్ గా 2.7 కోట్లకు అమ్మగా సినిమా 3 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగగా 2 వారాలు పూర్తీ అయిన తర్వాత టోటల్ గా ఇప్పటి వరకు 1.92 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని సూపర్ హిట్ నుండి ఇప్పుడు ఆల్ మోస్ట్ బ్లాక్ బస్టర్ రేంజ్ కి చేరుకుంది, వీకెండ్ తర్వాత సినిమా బ్లాక్ బస్టర్ గా మారబోతుంది అని చెప్పొచ్చు..