మహా శివరాత్రి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన 4 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర శివరాత్రి హాలిడే ని బాగానే ఎంజాయ్ చేశాయి కానీ 2 సినిమాలు మాత్రం అంచనాలను తగ్గట్లు ఆకట్టుకోలేక పోయాయి. అందుకోలేక పోయిన సినిమాల విషయానికి వస్తే డబ్బింగ్ మూవీ రాబర్ట్ మాస్ సెంటర్స్ లో బాగానే హోల్డ్ చేసినా మిగిలిన చోట్ల పెద్దగా ఇంపాక్ట్ లేదు, మొత్తం మీద సినిమా 10-12 లక్షల రేంజ్ అందుకోవచ్చు, అంతకు మించి వసూళ్లు సాధిస్తే అది చాలా పెద్ద విషయం.
ఇక గాలి సంపత్ సినిమా అనుకున్నట్లుగానే వెరీ స్లో స్టార్ట్ ని సొంతం చేసుకుంది, ఉన్న మూవీస్ లో ట్రైలర్ బెటర్ గా ఉన్న సినిమా ఇదే అయినా ఆడియన్స్ లో ఎందుకో క్యూరియాసిటీ ఈ సినిమా పై తక్కువగా ఉంది, అది కలెక్షన్స్ పై ఇంపాక్ట్ చూపింది, డే 1 కలెక్షన్స్ 1 కోటి రేంజ్ లోనే ఉండే ఛాన్స్ ఉంది…
ఇంకా ఎక్కువ వస్తే అది మహా ప్రసాదం, ఇక శ్రీకారం సినిమా బుకింగ్స్ నిరాశ పరిచినా బాక్స్ ఆఫీస్ దగ్గర తొలిరోజు జోరు చూపింది, డే ని స్లోగా స్టార్ట్ చేసినా కానీ డే ఎండ్ టైం కి హోల్డ్ చేసి మంచి కలెక్షన్స్ ని అందుకునే దిశగా దూసుకు పోతుంది, ఫస్ట్ డే ఇప్పుడు 3.5 కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించవచ్చు, లెక్క పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి..
ఇక అన్ని సినిమాలలోకి జాతిరత్నాలు దుమ్ము లేపే రేంజ్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా సంచలనాలు సృష్టించే అవకాశం ఎంతైనా ఉంది, సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో బుకింగ్స్ నుండే దుమ్ము లేపగా ఫస్ట్ డే ఓపెనింగ్స్ అదిరిపోయాయి, 4 కోట్లు మినిమమ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోవచ్చు అనుకుంటే ఇప్పుడు 4.5 కోట్ల మార్క్ ని కూడా అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
మొత్తం మీద అన్ని సినిమాల్లోకి జాతిరత్నాలు వీకెండ్ ఊరమాస్ బ్యాటింగ్ చేసేలా ఉండగా శ్రీకారం కూడా జోరు చూపే ఛాన్స్ ఉంది, ఇక మిగిలిన 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక 4 సినిమాల అఫీషియల్ ఫస్ట్ డే కలెక్షన్స్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.