2020 లో స్టార్ట్ అవ్వడం బాగానే స్టార్ట్ అయినా తర్వాత తర్వాత కరోనా ఎంటర్ అవ్వడం తో సినిమాల రిలీజ్ లు అన్నీ కూడా ఆగిపోయాయి. ఇయర్ ఎండ్ కి మళ్ళీ వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవుతున్నా కానీ బాలీవుడ్ వాళ్ళు మాత్రం ఇంకా తేరుకోలేక పోతున్నారు. ఇలా లాస్ట్ ఇయర్ లో వాళ్ళకి పెద్దగా కలిసి వచ్చింది కూడా ఏమి లేదు. ఇయర్ స్టార్టింగ్ లో అజయ్ దేవగన్ నటించిన…
తానాజీ అల్టిమేట్ హిట్ అయినా తర్వాత మళ్ళీ హిట్ దక్కలేదు. ఇక 2020 ఇయర్ లో మన సౌత్ నుండి వెళ్ళిన రీమేక్ లు కొన్ని ఉండగా వాటిలో ముఖ్యంగా మూడు రీమేక్ లు భారీ హైప్ ను సొంతం చేసుకున్నాయి కానీ రిజల్ట్ మాత్రం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది అందరికీ…
ఆ మూడు రీమేక్ సినిమాలే, టైగర్ ష్రాఫ్ నటించిన భాగీ 3, అక్షయ్ కుమార్ నటించిన లక్ష్మీ మరియు భూమి పడ్నేకర్ నటించిన దుర్వామతి… భాగీ 3 సినిమా తడాకా సినిమా కి రీమేక్ గా తెరకెక్కగా సినిమా ఒరిజినల్ తో పోల్చితే 10% కూడా ఆకట్టుకోలేక పోయింది… కానీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్నా తర్వాత కరోనా వలన పరుగు మధ్యలోనే ఆపింది.
ఇక రాఘవ లారెన్స్ ఎక్స్ లెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన కాంచన మూవీ రీమేక్ గా వచ్చిన లక్ష్మీ సినిమా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకుని డిసాస్టర్ టాక్ ని బాలీవుడ్ లో సొంతం చేసుకుంది. ఒరిజినల్ తో పోల్చితే మినిమమ్ లెవల్ ని కూడా అందుకోలేక పోయింది ఆ సినిమా. ఇక ఈ సినిమా త్వరగా….
వచ్చిన దుర్వామతి సినిమా భాగమతి సినిమాకి రీమేక్ గా రాగా ఒరిజినల్ తో పోల్చితే అసలు దరిదాపుల్లోకి కూడా రాలేక డిజిటల్ డిసాస్టర్ గా నిలిచింది. ఈ మూడు రీమేక్ లు బాలీవుడ్ లో లాస్ట్ ఇయర్ పరంగానే కాకుండా టోటల్ బాలీవుడ్ లో కూడా వీకేస్ట్ రీమేక్ మూవీస్ లో ఒకటిగా నిలిచాయి అని చెప్పొచ్చు…ఇక వీటితో పాటు హిందీ మూవీ రీమేక్ గా వచ్చిన కూలీ నంబర్ 1 కూడా డిసాస్టర్ రీమేక్ గా నిలిచి నిరాశ పరిచింది..