Home TRP రేటింగ్ డిసాస్టర్ మూవీ అని తిట్టారు…ఆల్ టైం రికార్డ్ TRP కొట్టింది!!

డిసాస్టర్ మూవీ అని తిట్టారు…ఆల్ టైం రికార్డ్ TRP కొట్టింది!!

0

కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు అంచనాలను అందుకొక పోయినా కానీ తర్వాత మాత్రం మెప్పిస్తాయి. చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ అయ్యి తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు సెన్సేషనల్ రేటింగ్ లతో దుమ్ము లేపినవి చాలా ఉన్నాయి. హిందీ లో పక్కా కమర్షియల్ మూవీస్ విషయం లో సినిమా ఎలా ఉన్నా కానీ సాలిడ్ గా వ్యూయర్ షిప్ ను ఆ సినిమా సొంతం చేసుకుంటూ ఉంటుంది…

రీసెంట్ గా థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకున్న ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ సినిమా ను చూసి తిట్టుకొని వారు లేరు. రాఘవ లారెన్స్ నటించి డైరెక్ట్ చేసిన కాంచన సినిమా రీమేక్ గా రూపొందిన ఈ సినిమా.

హిందీకి వచ్చేసరికి లారెన్సే డైరెక్ట్ చేసినప్పటికీ కూడా ఒరిజినల్ తో పోల్చితే ఏమాత్రం బాలేదని, అక్షయ్ కుమార్ యాక్టింగ్ కూడా ఏమాత్రం బాలేదని సినిమాకి డిసాస్టర్ రేటింగ్ లు ఇచ్చారు. సోషల్ మీడియా లో వీర లెవల్ లో ట్రోల్ కూడా చేశారు. కానీ ఇప్పుడు అదే సినిమా…

రీసెంట్ గా టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యి బాలీవుడ్ లో ఆల్ టైం హైయెస్ట్ TRP రేటింగ్ ను సొంతం చేసుకుంది. హిందీ మూవీస్ లో 2014 లో వచ్చిన సల్మాన్ ఖాన్ ప్రేం రతన్ ధన్ పాయో సినిమా 2 కోట్ల 51 లక్షల 19 వేల ఇంప్రెషన్స్ ని సొంతం చేసుకుని రికార్డ్ కొట్టగా ఆ రికార్డ్ ను 7 ఏళ్ల తర్వత ఇప్పుడు లక్ష్మీ సినిమా 2 కోట్ల 51 లక్షల 41 వేల ఇంప్రెషన్స్ తో బ్రేక్ చేసింది.

దాంతో బాలీవుడ్ మూవీస్ పరంగా బిగ్గెస్ట్ రికార్డ్ ను అందుకోగా ఓవరాల్ మూవీస్ పరంగా బాహుబలి 2 సినిమా హిందీ వర్షన్ 2 కోట్ల 60 లక్షల ఇంప్రెషన్స్ తో ఇప్పటికీ టాప్ లో ఉంది. లక్ష్మీ సినిమా కి సింపుల్ మన లెక్కల్లో TRP రేటింగ్ 30.23 రేటింగ్ దక్కింది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here