బాక్స్ ఆఫీస్ దగ్గర RX 100 సినిమా తో టాలీవుడ్ లో సెన్సేషనల్ హిట్ ను సొంతం చేసుకుని ఇన్స్టంట్ గా క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో కార్తికేయ.. కానీ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఏవి కూడా అంచనాలను అందుకోలేక పోయాయి. విలన్ గా చేసిన గ్యాంగ్ లీడర్ హిట్ కాలేదు. ఇక హీరోగా చేసిన హిప్పీ, గుణ 369 లాంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర…
అంచనాలను అందుకోలేక ఫ్లాఫ్స్ గా మిగిలిపోయాయి. ఇలాంటి టైం లో గోల్డెన్ చాన్స్ లా కార్తికేయ కి గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సినిమా చేసే అవకాశం వచ్చింది, ఆ సినిమానే చావు కబురు చల్లగా… ఈ సినిమా ఈ శుక్రవారం ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది.
ఇక సినిమా మొత్తం మీద అద్బుతమైన బిజినెస్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. ఓవరాల్ గా సినిమా బిజినెస్ ను గమనిస్తే… నైజాం లో 4.2 కోట్ల బిజినెస్ ను సీడెడ్ లో 2 కోట్ల బిజినెస్ ను టోటల్ ఆంధ్రాలో 6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించింది.
దాంతో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 12.2 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకోగా, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి మరో 80 లక్షల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఇప్పుడు 13 కోట్ల మార్క్ ని అందుకుంది. ఇది కార్తికేయ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే మినిమమ్ 13.5 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ పడ్డా కానీ ఈ రేంజ్ బిజినెస్ జరగడం అంటే విశేషం అనే చెప్పాలి. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో అనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది.