బాక్స్ ఆఫీస్ దగ్గర పాండమిక్ తర్వాత వరస్ట్ వీకెండ్ గా మార్చ్ 19 వీకెండ్ లో రిలీజ్ అయిన మూవీస్ ని చెప్పుకోవచ్చు, ఒక సినిమాను మించి ఒక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మినిమం కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకోలేక పోగా అన్ని సినిమాలు వీకెండ్ కే ఆల్ మోస్ట్ చేతులు ఎత్తేయగా ఇప్పుడు వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి మినిమమ్ కలెక్షన్స్ ని కూడా సొంతం చేసుకోలేక పోయింది.
ప్రతీ వారం రిలీజ్ అయిన మూవీస్ లో ఒకటి అయినా కొంచం బెటర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ వచ్చాయి కానీ ఈ వారం మాత్రం ఏకంగా రిలీజ్ అయిన 3 సినిమాలు కూడా మినిమమ్ కలెక్షన్స్ ని కూడా అందుకోలేక పోయాయి. ఇక వీక్ డేస్ లో సినిమాలు…
కంప్లీట్ గా స్లో డౌన్ అవ్వగా, 4 వ రోజు అన్ని సినిమాలు ఎంతో కొంత కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా 5 వ రోజు అన్ని సినిమాలు చిల్లర కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. చావు కబురు చల్లగా సినిమా 5 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 8 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది.
ఇక 50 కోట్ల బడ్జెట్ తో రూపొందిన సినిమా మోసగాళ్ళు 5 వ రోజు కేవలం 2 లక్షల షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుని ట్రేడ్ కి మైండ్ బ్లాంక్ చేసింది, ఇక ఆది సాయి కుమార్ నటించిన శశి సినిమా జీరో షేర్ ని సొంతం చేసుకుంది, అంటే థియేటర్స్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి ఈ సినిమాకి ఎదురు అయ్యింది….
ఇదీ మొత్తం మీద అన్ని సినిమాల 5 వ రోజు బాక్స్ ఆఫీస్ పరిస్థితి…. ఈ రేంజ్ లో డ్రాప్స్ రావడం అంటే సినిమాలు ఏ రేంజ్ డిసాస్టర్ మూవీస్ గా నిలిచాయో అర్ధం చేసుకోవచ్చు. ఇక అన్ని సినిమాలు వేటి రేంజ్ లో అవి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ నష్టాలను సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తుంది ఇప్పుడు.