Home Uncategorized హిట్టు లేక 9 ఏళ్ళు….ఏకంగా పాన్ ఇండియా మూవీ…బడ్జెట్ లెక్క ఇదే

హిట్టు లేక 9 ఏళ్ళు….ఏకంగా పాన్ ఇండియా మూవీ…బడ్జెట్ లెక్క ఇదే

0

సాయి కుమార్ తనయుడు ఆది కెరీర్ మొదలు పెట్టడం మంచి హిట్స్ తో మొదలు పెట్టినా తర్వాత కంప్లీట్ గా గాడి తప్పాడు, సరైన కథలను ఎంచు కోవడంలో విఫలం అయిన ఆది తొలి సినిమాల క్రేజ్ ను తక్కువ టైం లోనే కోల్పోయాడు, దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కోసం ఎదురు చూస్తూ వస్తున్నాడు ఆది. ప్రేమ కావాలి తో మంచి హిట్ కొట్టి లాంచ్ అయిన ఆది…

తర్వాత వెంటనే లవ్ లీ సినిమా తో మరో హిట్ కొట్టి జోరు చూపగా తర్వాత సుకుమారుడు సినిమా మంచి బజ్ నే క్రియేట్ చేసినా అనుకున్న రేంజ్ లో వర్కౌట్ అవ్వక పోవడం తో అప్పటి నుండి మొదలైన ఫ్లాఫ్ పరంపర 9 ఏళ్ళు అవుతున్నా కానీ…

రీసెంట్ గా శశి సినిమాతో వచ్చిన ఆది ఆ సినిమా తో కంబ్యాక్ ఇస్తాడు అనుకున్నా మరో డిసాస్టర్ ను సొంతం చేసుకున్నాడు. అయినా ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా మూవీ తోనే కంబ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు ఆది, కొత్త దర్శకుడు బలవీర్ డైరెక్షన్ లో SVR ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టొరీ పాయింట్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అంటున్నారు..

భారీ గ్రాఫిక్స్ హంగులతో ఈ సినిమా రూపొందుతుందని అంటుండటం విశేషం. దాంతో ఈ సినిమా బడ్జెట్ కూడా భారీ లెవల్ లో ఉండబోతుందని అంటున్నారు, ఆది కి ప్రస్తుతం మార్కెట్ లేదని తెలిసినా ఏకంగా 30 కోట్ల రేంజ్ బడ్జెట్ తో ఈ సినిమా ను తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. పాన్ ఇండియా సినిమా అంటే క్వాలిటీ కూడా ముఖ్యమే కాబట్టి బడ్జెట్ పెట్టడంలో తప్పు లేదు కానీ…ఎంతవరకు ఆది ఈ బడ్జెట్ ను రికవరీ చేస్తాడు అన్నది ఆసక్తిగా మారింది,

పాన్ ఇండియా మూవీ కాబట్టి అన్ని భాషల్లో శాటిలైట్ రైట్స్ డబ్బింగ్ రైట్స్ లాంటివి డీసెంట్ రేటు సొంతం చేసుకున్నా ఎంతో కొంత రికవరీ అవ్వోచ్చు, ఇక డిజిటల్ రైట్స్ కూడా ఉన్నాయి కాబట్టి కేవలం క్వాలిటీ అండ్ కంటెంట్ మీదే నమ్మకంతో 30 కోట్ల రేంజ్ బడ్జెట్ లో సినిమాను తెరకెక్కిస్తున్నారని అంటున్నారు. మరి ఈ సినిమా తో అయినా ఆది స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి.

Sashi 1st Day Total World Wide Collections!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here