కొన్ని కొన్ని సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా కానీ జనాలను థియేటర్స్ కి రప్పించ లేవు, కానీ అదే టైం లో కొన్ని సినిమాలు టాక్ ఎలా ఉన్నా కానీ ఆడియన్స్ ను ఓ రేంజ్ లో థియేటర్స్ కి రప్పించేలా చేస్తాయి. థియేటర్స్ లో రన్ కంప్లీట్ అయ్యాక అదే సినిమా డిజిటల్ లోనో లేక టీవీ లలోనో చూసినప్పుడు అప్పుడు ఈ సినిమా ఎలా నచ్చింది అబ్బా అనుకుంటూ ఉన్న సినిమాలు చాలా ఉన్నాయి.
లేటెస్ట్ గా ఇలానే ఇప్పుడు ఒక సినిమా పై ముందు ఉన్న టాక్ మారిపోయింది. ఆ సినిమానే నవీన్ పోలిశెట్టి నటించిన లేటెస్ట్ మూవీ జాతిరత్నాలు, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అన్ సీజన్ లో రిలీజ్ అయినా ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని…
ఏకంగా ట్రిపుల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అంటే బిజినెస్ మీద మూడు రేట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. అలాంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుని రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో డిజిటల్ రిలీజ్ అవ్వగా థియేటర్స్ లో చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు ఇప్పుడు…
సినిమా ని డిజిటల్ లో చూసి ఈ లేకి కామెడీ సినిమా అంతలా ఎలా హిట్ అయ్యింది అంటూ విమర్శిస్తున్నారు. సోషల్ మీడియా లో ఈ సినిమా హాష్ టాగ్ మీద ఇప్పుడు చూసిన వాళ్ళ కామెంట్స్ అన్నీ కూడా నెగటివ్ గానే ఉండటం గమనార్హం… థియేటర్ ఎక్సీపీరియన్స్ కి సోలోగా మొబైల్ లేదా టీవీ లో చూసే ఎక్సీపీరియన్స్ కి చాలా డిఫరెన్స్…
ఉంటుంది అని ఇప్పుడు జాతిరత్నాలు సినిమా మరోసారి రుజువు చేసింది. అప్పుడు ఈ కామెడీకి పగలబడి నవ్విన జనాలు ఇప్పుడు డిజిటల్ లో చూసి నవ్వు రావడం లేదు అంటున్నారు. మొత్తం మీద సినిమా మరీ అద్బుతమైన టాక్ ఏమి సొంతం చేసుకున్నా కానీ బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసి ఊహకందని విజయాన్ని నమోదు చేసుకుంది అన్నది మాత్రం ఎవ్వరూ కాదనలేని నిజం…