పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ మూవీ కి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఇంపాక్ట్ చూపింది. సినిమా రిలీజ్ అయ్యే టైం కే పీక్ స్టేజ్ కి చేరుకున్న సెకెండ్ వేవ్ మొదటి వారం పూర్తీ అయ్యే టైం కి ఆల్ టైం హై నోట్ కి చేరుకొని అప్ కమింగ్ మూవీస్ అన్నింటినీ రిలీజ్ లు ఆపుకునేలా చేసింది, దాంతో థియేటర్స్ జనాలు చూడటానికి ఉన్న ఆప్షన్ వకీల్ సాబ్ మాత్రమే అవ్వగా…
సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన సెకెండ్ వీకెండ్ లో పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సాధించిన సినిమా వర్కింగ్ డేస్ లో స్లో అయింది. అయినా కానీ శ్రీరమానవమి రోజున 50 లక్షల రేంజ్ కలెక్షన్స్ తో మళ్ళీ గ్రోత్ ని సాధించిన ఈ సినిమా ఉన్న అవోరోదాల నడుమ ఇప్పటికే…
చాలా వరకు రికవరీ చేసింది కానీ బ్రేక్ ఈవెన్ ముంగిట వచ్చి ఆగింది ఇప్పుడు, బాక్స్ ఆఫీస్ దగ్గర 13 వ రోజు 50 లక్షల షేర్ తర్వాత 14వ రోజు సినిమా 22 లక్షల షేర్ ని సొంతం చేసుకుంది. ఇక మొత్తం మీద సినిమా 2 వారాల్లో వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 24.92Cr (inc.GST)
👉Ceeded: 12.85Cr
👉UA: 11.66Cr (inc.GST)
👉East: 6.45Cr (inc.GST)
👉West: 6.96Cr (inc.GST)
👉Guntur: 7.08Cr (inc.GST)
👉Krishna: 4.96Cr (inc.GST)
👉Nellore: 3.38Cr
AP-TG Total:- 78.26CR (120.84Cr Gross~)
KA+ROI – 3.66Cr (Corrected)
OS- 3.79Cr (Corrected)
Total WW: 85.71CR(136.95CR~ Gross)
ఇదీ సినిమా వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్…
కర్ణాటకలో థియేటర్స్ బంద్, తెలుగు రాష్ట్రాలలో 50% అండ్ డైలీ 2 షోలు మాత్రమే, ఓవర్సీస్ లో 30% లిమిటేషన్స్ ఇలా అన్ని చోట్ల సమస్యలు ఉన్నా 90 కోట్ల టార్గెట్ కి 85.71 కోట్లు రికవరీ చేసిన సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 4.29 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వీకెండ్ తర్వాత అన్ని థియేటర్స్ ని మూసేస్తారు అంటున్నారు ఇప్పుడు.