సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో ఉంది…. ఇలాంటి టైం లో కొత్త సినిమాలు ఏవి కూడా ఆడియన్స్ ముందుకు రావాలి అంటే బయపడుతున్నాయి. ఇలాంటి టైం లో సెకెండ్ వేవ్ మొదలైన కొన్ని రోజులకే ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్ సెన్సేషనల్ ఓపెనింగ్స్ తో దుమ్ము దుమారం చేసింది, తర్వాత వర్కింగ్ డేస్ లో స్లో అయినా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్…
పీక్స్ కి చేరడం తో థియేటర్స్ లో ఆక్యుపెన్సీ, డైలీ షోలకు తగ్గించారు. దాంతో ఆ ఇంపాక్ట్ కలెక్షన్స్ పడగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది అన్నది ఆసక్తిగా మారగా బ్రేక్ ఈవెన్ ను అందుకోవాలి అంటే మాత్రం…
సినిమా ఇంకా కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉండగా మొత్తం మీద ఇప్పుడు 18 రోజులు పూర్తీ అయిన తర్వాత సినిమా ప్రస్తుత పరిస్థితులలో కూడా ఆల్ మోస్ట్ 95.65 పెర్సెంట్ టార్గెట్ ను రికవరీ చేసి బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ గా నిలిచింది అని చెప్పాలి. సినిమా మొత్తం మీద 18 రోజుల్లో…
టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 25.01Cr (inc.GST)
👉Ceeded: 12.89Cr
👉UA: 11.71Cr (inc.GST)
👉East: 6.49Cr (inc.GST)
👉West: 7.01Cr (inc.GST)
👉Guntur: 7.12Cr (inc.GST)
👉Krishna: 5.01Cr (inc.GST)
👉Nellore: 3.39Cr
AP-TG Total:- 78.63CR (121.40Cr Gross~)
KA+ROI – 3.66Cr (Corrected)
OS- 3.81Cr (Corrected)
Total WW: 86.10CR(137.65CR~ Gross)(95.65% Recovery)సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 90 కోట్లు కాగా 18 రోజుల్లో 86 కోట్ల మార్క్ ని అధిగమించిన….
సినిమా బ్రేక్ ఈవెన్ కి మరో 3.9 కోట్ల దూరంలో ఉంది. సినిమా 18 వ రోజు 5 లక్షల షేర్ ని సాధించింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు అలాంటివి కాబట్టి ఇవి రావడమే చాలా గొప్ప విషయం… ఇక లాంగ్ రన్ ని ఎక్స్ పెర్ట్ చేయడం కూడా తప్పే… అయినా కానీ ఈ రేంజ్ రికవరీ ని సొంతం చేసుకోవడం విశేషం అనే చెప్పాలి. టికెట్ హైక్స్, స్పెషల్ షోల పర్మీషణ్ లాంటివి వచ్చి ఉంటే ఈ పాటికే సినిమా మరో లెవల్ లో ఉండి ఉండేది..