Home న్యూస్ 5 రోజుల టైం ఉంది….ఇది కొడితే…రికార్డ్ సంచలనం ఖాయం!!

5 రోజుల టైం ఉంది….ఇది కొడితే…రికార్డ్ సంచలనం ఖాయం!!

1878
0

నట సింహం నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ టీసర్ టాలీవుడ్ లో సంచలన రికార్డులతో ఊచకోత కోసింది. ఇప్పటికీ జోరు తగ్గని రికార్డుల జోరు ని కంటిన్యూ చేస్తూ దూసుకు పోతున్న ఈ టీసర్ సంచలన రికార్డులలో భాగంగా ఇప్పుడు మరో మైలురాయి ని అందుకోవడానికి సిద్ధం అవుతుంది అని చెప్పాలి. సీనియర్ హీరోల్లో ఆల్ టైం రికార్డులను…

నమోదు చేసిన ఈ టీసర్ సౌత్ లో కూడా సరికొత్త రికార్డులను అందుకున్న సీనియర్ హీరో మూవీ టీసర్ గా నిలవగా టాలీవుడ్ లో హైయెస్ట్ వ్యూస్ ని సొంతం చేసుకున్న టీసర్ గా కూడా నిలిచింది. ఇక లేటెస్ట్ గా 46 మిలియన్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ టీసర్ ఇప్పుడు…

50 మిలియన్ వ్యూస్ వైపు దూసుకు పోతూ ఉండగా ఈ రికార్డ్ ను అత్యంత వేగంగా సొంతం చేసుకోవడానికి ఈ టీసర్ కి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రికార్డ్ ను ముందు ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ 6 నెలలకు పైగా టైం తీసుకుని…

ఈ రికార్డ్ ను సొంతం చేసుకోగా, లేటెస్ట్ గా అల్లు అర్జున్ పుష్ప ఇంట్రో టీసర్ తో 20 రోజుల టైం మాత్రమే తీసుకుని టాలీవుడ్ లో ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్న రికార్డ్ ను సొంతం చేసుకోగా ఇప్పుడు ఈ రికార్డ్ ను బ్రేక్ చేయడానికి అఖండ టీసర్ కి అద్బుతమైన ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. రిలీజ్ అయిన 14 రోజుల్లోనే ఏకంగా…

46 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న అఖండ టీసర్ మరో 5 రోజుల్లో 50 మిలియన్ మార్క్ ని అందుకుంటే ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ రికార్డ్ సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది… మరి బాలయ్య టీసర్ ఈ రికార్డ్ ను కూడా అందుకుంటే సీనియర్ హీరోల్లో మరో బిగ్గెస్ట్ రికార్డ్ సొంతం అవ్వడం ఖాయమని చెప్పొచ్చు. చూడాలి మరి ఏమవుతుందో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here