కొన్ని కొన్ని సినిమాలు ఇంతే…. థియేటర్స్ లో కొందరికి నచ్చుతాయి, కొందరికీ టెలివిజన్ లో నచ్చుతాయి. రీసెంట్ టైం లో ఆడియన్స్ టేస్ట్ కూడా వెంట వెంటనే మారిపోతూ ఉన్న నేపధ్యంలో థియేటర్స్ లో నచ్చిన సినిమాలు డిజిటల్ లో నచ్చడం లేదు, డిజిటల్ లో నచ్చిన సినిమాలు థియేటర్స్ లో నచ్చడం లేదు. ఇప్పుడు లేటెస్ట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని విజయాన్ని నమోదు చేసిన సినిమా జనాలను డిజిటల్ లో నచ్చడం లేదు.
ఆ సినిమానే మార్చి నెలలో బాక్స్ ఆఫీస్ ను తెలుగు రాష్ట్రాలలో ఓవర్సీస్ లో కూడా ఓ రేంజ్ లో షేక్ చేసిన జాతిరత్నాలు సినిమా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ టార్గెట్ కి ఆల్ మోస్ట్ 3 రెట్లు ఎక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని….
ఊరమాస్ ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది, కానీ డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా థియేటర్స్ లో ఎలా విరగబడి చూశారు అంటూ విమర్శలు కూడా వచ్చాయి, అవి పక్కకు పెడితే రీసెంట్ గా ట్రేడ్ లో ఈ సినిమా డిజిటల్ రిలీజ్ అయిన తర్వాత…
అమెజాన్ ప్రైమ్ లో వ్యూవర్ షిప్ పై టాక్ గట్టిగా వినిపిస్తుంది, ఆ న్యూస్ ప్రకారం సినిమా కోసం భారీ రేటు పెట్టిన అమెజాన్ ప్రైమ్ ఆ రేటు కి సినిమా న్యాయం చేయలేదని, అనుకున్న రేంజ్ లో వ్యూస్ సినిమాకి దక్కలేదని టీం తో చెప్పారు అంటూ టాలీవుడ్ లో టాక్ గట్టిగానే వినిపిస్తుంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అన్నది…
అమెజాన్ ప్రైమ్ అఫీషియల్ గా వ్యూస్ ని రివీల్ చేస్తేనే తెలుస్తుంది కానీ ఎక్కువ మంది డిజిటల్ రిలీజ్ అయిన మూవీస్ ని పైరసీ లోనే చూడటానికి ఎగబడతారు, ఆ విధంగా కూడా వ్యూస్ పై ఇంపాక్ట్ పడి ఉండొచ్చు. ఎటొచ్చి బాక్స్ ఆఫీస్ రిజల్ట్ చూసి సాలిడ్ రేటు పెట్టి కొన్న అమెజాన్ ప్రైమ్ కి రికవరీ అవ్వాలి అంటే ఇంకా చాలా టైం పట్టేలా ఉందని లేటెస్ట్ టాక్..