సౌత్ ఇండస్ట్రీలలో కలెక్షన్స్ వైజ్ కేరళ ఇండస్ట్రీ మరియు కర్ణాటక ఇండస్ట్రీలు టాలీవుడ్ కోలివుడ్ తో పోల్చితే చిన్నవే అని చెప్పాలి. కానీ అప్పుడప్పుడు ఇక్కడ నుండి కూడా భీభత్సమైన హిట్స్ మనం చూస్తూనే ఉన్నాం. కర్ణాటక ఇండస్ట్రీ రూపు రేఖలను KGF సినిమా మార్చేస్తే… మొదటి నుండి క్వాలిటీ మూవీస్ తో మలయాళ ఇండస్ట్రీ ఇండియాలోనే బెస్ట్ మూవీస్ ని అందిస్తూ వస్తుంది. కలెక్షన్స్ వైజ్ కూడా పులిమురుగన్ లాంటి సినిమాలు 150 కోట్లకు పైగా…
కలెక్షన్స్ తో సంచలనాలను సృష్టించాయి. ఇక రీసెంట్ గా కరోనా ఎఫెక్ట్ వలన చాలా సినిమాలు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ లను సొంతం చేసుకుంటూ వస్తుండగా ఈ ఇయర్ లో అలా డిజిటల్ రిలీజ్ అయిన సినిమాల్లో బెస్ట్ మూవీ గా నిలిచిన సినిమా…
కచ్చితంగా మోహన్ లాల్ నటించిన దృశ్యం 2 సినిమానే అని చెప్పాలి… మొదటి పార్ట్ కి ఏమాత్రం తీసిపోని విధంగా తెరకెక్కించిన సెకెండ్ పార్ట్ ఓ రేంజ్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసి డిజిటల్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ మూవీస్ లో ఒకటిగా నిలిచింది.
అలాంటి ఈ సినిమా ను అమెజాన్ ప్రైమ్ డైరెక్ట్ రిలీజ్ కోసం ఎంతకు కొన్నారు అన్న డీటైల్స్ ను చాలా టైం చెప్పకుండా ఉంచారు. కానీ ఎట్టకేలకు రీసెంట్ గా ఆ డీటైల్స్ బయటికి రాగా సినిమా డైరెక్ట్ రిలీజ్ కోసం ఏకంగా 38 కోట్ల భారీ రేటు ను చెల్లించి అమెజాన్ ప్రైమ్ హక్కులను సొంతం చేసుకుందని సమాచారం. ఇది మలయాళ ఇండస్ట్రీ లో ఆల్ టైం…
హైయెస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు అని అంటున్నారు. సినిమా బడ్జెట్ మోహన్ లాల్ రెమ్యునరేషన్ కాకుండా కేవలం 4 కోట్ల రేంజ్ బడ్జెట్ లోనే రూపొందిందట… టోటల్ బిజినెస్ లో మోహన్ లాల్ ప్రాఫిట్ షేర్ తీసుకున్నారట. అయినా కానీ నిర్మాతకి కూడా భారీ లాభాలను ఈ సినిమా తీసుకు రాగా రీమేక్ రైట్స్ కూడా ఇతర ఇండస్ట్రీలలో సాలిడ్ రేటు పలికింది. దాంతో భారీ లాభాలు దక్కాయి ఈ సినిమాతో.