Home గాసిప్స్ 50 కోట్లతో 250 కోట్లు…200 కోట్ల లాభం…ఇదెక్కడి మాస్ రా బాబు..!!

50 కోట్లతో 250 కోట్లు…200 కోట్ల లాభం…ఇదెక్కడి మాస్ రా బాబు..!!

1

స్టార్ హీరోల సినిమాలు అంటే హిట్స్ కి ఫ్లాఫ్స్ కి సంభందం లేకుండా అద్బుతమైన బిజినెస్ లు లాంటివి క్రమం తప్పకుండా ప్రతీ సినిమాకు జరుగుతూనే ఉంటాయి, స్టార్ హీరోలతో సినిమా లు తీసే నిర్మాతలు చాలా రేర్ టైమ్స్ మాత్రమే నష్టపోతారు, చాలా వరకు సినిమాలను కొన్న వాళ్ళు కలెక్షన్స్ రాకపోతే నష్టపోతారు కానీ నిర్మాతలు అన్ని విధాల బిజినెస్ లతో ఫుల్ ప్రాఫిట్స్ ను ఎక్కువ శాతం సొంతం చేసుకుంటూ ఉంటారు.

లేటెస్ట్ గా తిరిగి సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ పీక్స్ లో కొనసాగుతున్న తరుణం లో అన్ని సినిమాల రిలీజ్ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ పోన్ అవుతూ రాగా లాస్ట్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ అవ్వాల్సిన సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా ఈ ఇయర్ కి…

పోస్ట్ పోన్ అయినా సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో ఇప్పుడు కొన్ని థియేటర్స్ లో అలాగే డిజిటల్ లో ఒకేసారి రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ సినిమా కి సల్మాన్ ఖాన్ కూడా నిర్మాత గా ఉండగా సినిమా కి రెమ్యునరేషన్ తీసుకోకుండా ప్రాఫిట్ షేర్ ని తీసుకున్నారు.

సినిమా మొత్తం మీద సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ పక్కకు పెట్టి టోటల్ బడ్జెట్ 50 కోట్ల లోపే ముగిసిందని సమాచారం. ఇక సినిమా కంప్లీట్ అన్ని రైట్స్ ని జీ నెట్ వర్క్ కి గంప గుత్తుగా అమ్మేశారని లేటెస్ట్ న్యూస్. సినిమా డిజిటల్, శాటిలైట్ మ్యూజిక్ థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ కంప్లీట్ రైట్స్ ని ఒకే సారి ఏకంగా 250 కోట్ల రేటు కి…

అమ్మారట. అంటే సినిమా రిజల్ట్ తో సంభందం లేకుండా ఓవరాల్ బిజినెస్ కంప్లీట్ అయిపొయింది. మొత్తం మీద 50 కోట్ల బడ్జెట్ కి 250 కోట్ల బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు. ఈ సినిమా ను పే పెర్ వ్యూ పద్దతిలో ముందు రిలీజ్ చేసి తర్వాత డిజిటల్ లో తర్వాత టెలివిజన్ లో టెలికాస్ట్ చేయాలని జీ నెట్ వర్క్ భావిస్తుందట. మరి వాళ్ళకి ఎప్పటికి ఈ పెట్టిన రేటు రికవరీ అవుతుందో చూడాలి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here