అందరూ కష్టపడి సినిమాలు చేసేది ఆ సినిమాలు ఆడియన్స్ ముందుకు రావాలని కలెక్షన్స్ వర్షం, ప్రశంసలు అభిమానుల అంచనాలను అందుకునే సినిమాలు ఇచ్చామన్న నమ్మకం కోసం చేస్తూ ఉంటారు ఎక్కువ మంది, అన్ని సినిమాలు అంచనాలను అందుకోవు కానీ, అందుకునేలా ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన పరిస్థితులు అన్నీ మారిపోయి థియేటర్స్ అన్నీ కూడా ఆల్ మోస్ట్ క్లోజ్ అయిపోయిన విషయం తెలిసిందే.
దాంతో చాలా సినిమాలు రూట్ మార్చి తిరిగి డిజిటల్ రిలీజ్ పై దృష్టి పెట్టాయి, క్రేజ్ ను బట్టి రేట్లు సాలిడ్ గానే వస్తూ ఉన్న ఒక సినిమా విషయం లో మాత్రం సెకెండ్ వేవ్ కన్నా ముందే సినిమాను డిజిటల్ లో రిలీజ్ చేయాలనీ నిర్ణయం తీసుకున్నారు.
ఆ సినిమానే ధనుష్ నటించిన జగమే తందిరం సినిమా… థియేటర్స్ లో సినిమాలు ఫస్ట్ వేవ్ తర్వాత ఓ రేంజ్ లో కలెక్షన్స్ ను రాబడుతున్న టైం లోనే ఈ సినిమా డిజిటల్ రిలీజ్ చేయాలనీ డిసైడ్ అవ్వగా అప్పటి నుండే హీరో ధనుష్ కి ఈ సినిమా యూనిట్ పై కోపం పెరిగిందట.
సెకెండ్ వేవ్ స్టార్ట్ అయిన తర్వాత 50% ఆక్యుపెన్సీ తోనే ధనుష్ నటించిన కర్ణన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ను సాధించింది, జగమే తందిరం సినిమా కూడా పరిస్థితులు కొద్దిగా సద్దుకున్నాక థియేటర్స్ లో రిలీజ్ చేయాలనీ ధనుష్ భావిస్తున్నా కానీ మేకర్స్ సాలిడ్ రేటు ఆఫర్ రావడం తో జూన్ లో సినిమా ను… డిజిటల్ రిలీజ్ ను కన్ఫాం చేశారు.
దాంతో అప్పటి నుండి సినిమా పై ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా హీరో ధనుష్ వేయలేదు, ఇతర సినిమాల ట్వీట్స్ లేదా ఎమర్జెన్సీ ట్వీట్స్ వేస్తున్నాడు సినిమా పై ఒక్క ట్వీట్ కూడా వేయకపోవడం తో తనకి ఇది ఇష్టం లేదని ఇన్ డైరెక్ట్ గానే చెబుతున్నాడు అంటూ కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు. ఇక సినిమా జూన్ లో తమిళ్ తో పాటు తెలుగు మలయాళం కన్నడ లో కూడా రిలీజ్ కానుంది.