టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి 6 ఏళ్ళు కావోస్తున్నా ఇప్పటి వరకు క్లీన్ హిట్ కొట్టని హీరో అఖిల్ అక్కినేని, తొలి సినిమా కి ముందే కావల సినంత క్రేజ్, భారీ స్టార్ కాస్ట్ తో ఫస్ట్ సినిమా చేసినా తర్వాత ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేసినా, ఇవన్నీ కాదు మంచి కథతో వస్తామని వేరే బ్యానర్ లో చేసినా కానీ అన్నీ ఫ్లాఫ్స్ గానే మిగిలాయి బాక్స్ ఆఫీస్ దగ్గర.
ఇలాంటి టైం లో అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ లో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో పూజా హెడ్గే హీరోయిన్ గా చేస్తున్న మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమా తో సెన్సేషనల్ హిట్ కొట్టాలని ఎదురు చూస్తున్న తరుణంలో సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తో రిలీజ్ నిరవధికంగా ఆగిపోగా…
ఈ ఇయర్ సెకెండ్ ఆఫ్ లో ఆడియన్స్ ముందుకు వస్తామని ఎదురు చూస్తున్న తరుణంలో ఇతర సినిమాలకు వచ్చినట్లే ఈ సినిమా కి కూడా OTT ఆఫర్స్ గట్టిగానే వస్తున్నాయట. మొదట మొత్తం ఆఫర్స్ టీం వరకు వెళ్ళగా సినిమా ను డిజిటల్ రిలీజ్ చేయమని వాళ్ళు చెప్పగా తర్వాత కింగ్ నాగార్జున దగ్గరకు వెళ్లారట.
తమ బెస్ట్ OTT ఆఫర్ అంటూ సినిమా కి మంచి రేటు ఆఫర్ చేసి సినిమాను డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయాలనీ కోరగా నాగార్జున మండి పడ్డారని సమాచారం. మూడు సినిమాలు చేసినా క్లీన్ హిట్ దక్కలేదని నాలుగో సినిమా కోసం ఎదురు చూస్తుంటే… థియేటర్స్ లో కాకుండా డైరెక్ట్ రిలీజ్ చేయమంటారా అంటూ కోపగించుకున్నారట.
ఆఫర్ ఏదైనా ఎంతైనా కానీ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేసే అవకాశమే కాలేదని, సినిమా ను ఎట్టి పరిస్థితులలో కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం తప్పితే డిజిటల్ రిలీజ్ చేయమని గట్టిగా చెప్పినట్లు తెలుస్తుంది. బొమ్మరిల్లు భాస్కర్ కూడా సినిమా పై ఫుల్ కాన్సిఫెండ్ గా ఉన్నారట. మరి ఈ సినిమా తో అఖిల్ 6 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న క్లీన్ హిట్ ని అందుకుంటాడో లేదో చూడాలి.