Home న్యూస్ D-కంపెనీ రివ్యూ…..ఇది మరో అద్బుతం….హిస్టరీ రిపీట్!!

D-కంపెనీ రివ్యూ…..ఇది మరో అద్బుతం….హిస్టరీ రిపీట్!!

1

టైటిల్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండీ, రామ్ గోపాల్ వర్మ రక్తచరిత్ర సినిమా మాదిరిగా ఎలాంటి అద్బుతం చేయలేదు, తన స్టైల్ లోనే చేసిన మరో ప్రయత్నం D-కంపెనీ తన రీసెంట్ మూవీస్ లానే మరో అద్బుతం గా నిలిచిపోతుంది. ఇది అండర్ వరల్డ్ మూవీస్ లో మహాభారతం లాంటి సిరీస్ అని, ఇందులో ఒక్కొటిగా సినిమాలు వస్తాయంటూ చెప్పుకొచ్చిన వర్మ D-కంపెనీ తో ఆడియన్స్ ముందుకు రాగా ఈ సారి కూడా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు…

అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం మీద ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి… దావూద్ బ్యాక్ స్టొరీ ఏంటి అనేది దాదాపు ప్రతీ ఒక్కరికీ తెలిసిందే, రామ్ గోపాల్ వర్మ తన సినిమాల్లోనే ఎన్నో సార్లు దావూద్ గురించి చూపెట్టాడు, ఇప్పుడు మళ్ళీ అదే కథతో…

D-కంపెనీ అంటూ సినిమా తో వచ్చాడు. సినిమా కథ ఏంటంటే… కానిస్టేబుల్ కొడులులు అయిన అన్నదమ్ములు తప్పుడు రూట్ లో చేరి దందాలు చేస్తూ తర్వాత ఒక గ్యాంగ్ పెట్టి మెల్లి మెల్లిగా ఏకంగా అండర్ వరల్డ్ డాన్ గా మారతాడు, ఎదిగే క్రమం లో దావూద్ అన్న చనిపోవడం తో ఆ పగ హీరో ఎలా తీసుకున్నాడు అన్నది కథ…

రొటీన్ రొట్ట కొట్టుడు స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ స్లో మోషన్ సీన్స్ ఇలా రామ్ గోపాల్ వర్మ రీసెంట్ మూవీస్ అన్నింటి లో ఉన్న పైత్యం ఈ సినిమా లో కూడా కనిపిస్తుంది, లెంత్ తక్కువే అయినా బోర్ కొట్టడం యాక్టర్స్ నటిస్తున్నా ఆ సీన్స్ కి మనం కనెక్ట్ అవ్వడం తక్కువే అనిపిస్తుంది…  క్లైమాక్స్ ని కొంచం బాగా ప్రెజెంట్ చేయడం…..

ఒక్కటే ఎంతో కొంత పర్వాలేదు అనిపించినా మొత్తం మీద సినిమా ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు, రామ్ గోపాల్ వర్మ మనసు పెట్టి తీసిన సినిమా అంటూ ఎంత చెప్పినా రీసెంట్ చెత్త మూవీస్ కన్నా ఒక్క ఇంచ్ బెటర్ తప్పితే ఓవరాల్ గా మిగిలిన అద్బుతమైన సినిమాల సరసన ఈ సినిమా ఒకటిగా చేరేదే… అలాగే ఈ సినిమా కంబ్యాక్ ఇస్తుంది అని చెప్పినా రీసెంట్ మూవీస్ హిస్టరీలానే ఈ సినిమా రిపీట్ అయ్యింది అని చెప్పొచ్చు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here