చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే చాలు జనాలు ఎగబడి థియేటర్స్ కి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది, కానీ ఈ మధ్య ఎందుకో కొన్ని సినిమాలు మంచి టాక్ ని సొంతం చేసుకున్నా కానీ అంచనాలను మాత్రం అందుకోలేక పోయాయి, అలాంటి సినిమాల్లో చిన్న సినిమాలే కాదు పెద్ద సినిమాలు కూడా ఉన్నాయి… చిన్న సినిమాల్లో మంచి టాక్ ని తెచ్చుకున్నా పోటి…
తీవ్రంగా ఉండటం తో పెద్దగా ఎవ్వరూ పట్టించుకోక పోవడం తో పరుగును చాలా త్వరగా ముగించిన సినిమాలలో ప్లే బ్యాక్ సినిమా కూడా ఒకటి, అందరూ చిన్న యాక్టర్స్ తోనే రూపొందిన ఈ సినిమా ని థియేటర్స్ లో చూసిన వాళ్ళు తక్కువే అయినా సినిమా చూసిన వాళ్ళని మట్టుకు…
బాగా ఇంప్రెస్ చేసింది, అరె మంచి సినిమా అందరూ చూడండి అంటూ సోషల్ మీడియా లో టాక్ స్ప్రెడ్ అయ్యే లోపు కొత్త సినిమాల రాకతో ఈ సినిమా పరుగును త్వరగానే ముగించుకోవాల్సి వచ్చింది, కానీ ఇప్పుడు ఈ సినిమా ను డిజిటల్ లో రిలీజ్ చేయబోతున్నారు.
ఆహా యాప్ వాళ్ళు ఈ సినిమా కి ఆల్ మోస్ట్ 25 లక్షల రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారట, తర్వాత ఆడియన్స్ రెస్పాన్స్ ను బట్టి మంత్లీ వైజ్ రెవెన్యూ ని సెండ్ చేస్తామని చెప్పుకొచ్చారట. దాంతో ఈ సినిమా ఇప్పుడు 21 న డిజిటల్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుండగా సోషల్ మీడియా లో ఈ సినిమా ను అప్పుడు చూసిన వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు.
మంచి సినిమా డిఫెరెంట్ కాన్సెప్ట్ తో యూనిక్ గా అనిపించే సినిమా కచ్చితంగా చూడండి అంటూ చెబుతూ ఉండటం తో సడెన్ గా ఇప్పుడు సినిమా కి మంచి హైప్ వచ్చిందని చెప్పొచ్చు. రెండు డిఫెరెంట్ టైం కి చెందిన ఇద్దరూ ఒక ఫోన్ తో కనెక్ట్ అవ్వడం అనే కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా ఇప్పుడు డిజిటల్ రిలీజ్ తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకుంటుందో చూడాలి.