ఈ మధ్య కాలం లో చాలా సినిమాల విషయం లో ఇదే జరిగింది, లెక్కకు మిక్కిలి సినిమాలు ఆడియన్స్ ముందుకు వస్తూ పోతూ ఉండటం తో అన్ని సినిమాలు చూడలేని ఆడియన్స్ అందులో కొన్ని సినిమాలను పట్టించుకోలేదు, దాంతో ఆ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రిజల్ట్ ని అస్సలు సొంతం చేసుకోలేక పోయాయి. ఇక అవే సినిమాలు తరువాత టైం లో డిజిటల్ రిలీజ్ అయినప్పుడు మాత్రం ముందే సినిమాను…
థియేటర్స్ లో చూసి ఉంటే బాగుండేది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి రీసెంట్ టైం లో. ఇలా అనిపించిన మరో సినిమా ప్లే బ్యాక్ అనే చిన్న సినిమా. ఆడియన్స్ ముందుకు మార్చ్ నెలలో వచ్చిన ఈ సినిమా కి మంచి టాకే ఆడియన్స్ నుండి….
వచ్చింది అని చెప్పాలి. చూసింది తక్కువ మందే అయినా కానీ సినిమా బాగుందని అంతా మెచ్చుకున్నారు. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆ ఇంపాక్ట్ ఏమాత్రం కనిపించక పోవడం తో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని పరుగును త్వరగానే పూర్తీ చేసుకుంది.
కానీ అదే సినిమాను ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ చేశారు, ఇక సినిమా డిజిటల్ రిలీజ్ కన్నా ముందే అందరిలోనూ మంచి హైప్ నెలకొనగా సినిమా డిజిటల్ రిలీజ్ అయ్యాక సినిమా ను థియేటర్స్ లో మిస్ అయిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు డిజిటల్ లో చూసి మెచ్చుకోవడం మొదలు పెట్టారు, చిన్న సినిమానే అయినా ఇలా…
డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తక్కువ బడ్జెట్ లోనే చాలా బాగా తీశారు అంటూ సోషల్ మీడియా లో అందరూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు, థియేటర్స్ లో మిస్ అయినా డిజిటల్ లో మట్టుకు సినిమా కి అద్బుతమైన రెస్పాన్స్ తో పాటు సాలిడ్ వ్యూస్ కూడా లభిస్తూ ఉండటం విశేషం అనే చెప్పాలి.