టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా సూపర్ స్టార్ అన్న విషయం అందరికీ తెలిసిందే, అప్ కమింగ్ మూవీస్ అన్నీ కూడా ఊహకందని భారీ బడ్జెట్ సినిమాలు కాగా అన్నీ కూడా పాన్ ఇండియా లెవల్ లో అన్ని భాషల్లో కూడా రిలీజ్ కాబోతున్న విషయం అందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రజెంట్ క్రేజ్ పీక్స్ లో ఉండగా ప్రభాస్ లాస్ట్ మూవీ సాహో డిసాస్టర్ అయినప్పటికీ కూడా ఆ ఇంపాక్ట్…
ప్రభాస్ కొత్త సినిమా రాధేశ్యామ్ పై ఇసుమంత కూడా ఉండటం లేదని చెప్పొచ్చు. కాగా అన్నీ అనుకున్నట్లు జరిగితే సినిమా ఆడియన్స్ ముందుకు జులై ఎండ్ లో రావాల్సింది కానీ ఇప్పుడు సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ ఉండటం తో సినిమా రిలీజ్ మరోసారి పోస్ట్ పోన్…
అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. ఇక సినిమా పోస్ట్ పోన్ అయినా కానీ హిందీ లో సినిమా బిజినెస్ లెక్కలు ఆల్ రెడీ కన్ఫాం అయ్యాయి అంటున్నారు. సినిమా హిందీ రైట్స్ ని మమ్మోత్ రేటు కి అమ్మారు అంటూ ఇప్పుడు ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. UV క్రియేషన్స్ వాళ్ళు ఇంకా…
అఫీషియల్ గా ఏమి అనౌన్స్ చేయలేదు కానీ సినిమా హిందీ రైట్స్ మొత్తం మీద ఏకంగా 120 కోట్ల భారీ రేటు కి అమ్ముడు పోయినట్లు చెబుతున్నారు. ఇది నిజంగానే అల్టిమేట్ రేటు అని చెప్పాలి. బాక్స్ ఆఫీస్ దగ్గర సాహో డిసాస్టర్ టాక్ తో కూడా బాలీవుడ్ లో సూపర్ హిట్ గా నిలవడం తో ఈ రేంజ్ రేటు కి సినిమా హిందీ…
బిజినెస్ ను కంప్లీట్ చేశారని చెప్పొచ్చు. ఈ రైట్స్ కేవలం థియేట్రికల్ రైట్స్ మాత్రమేనా లేక టోటల్ హిందీ రైట్సా అన్న విషయం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలోనే దాని పై స్పష్టమైన అప్ డేట్ ఉండొచ్చు. మొత్తం మీద డిసాస్టర్ తర్వాత కూడా ప్రభాస్ ఈ రేంజ్ రచ్చ చేయడం అంటే సామి శిఖరం అని చెప్పొచ్చు.