కోలివుడ్ టాప్ హీరో ఇలయ దళపతి విజయ్ ప్రస్తుతం కెరీర్ లోనే ఆల్ టైం పీక్ క్రేజ్ ని ఎంజాయ్ చేస్తూ దూసుకు పోతున్న విషయం తెలిసిందే. కెరీర్ లో చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర 200 కోట్లకు పైగా గ్రాస్ ని మినిమమ్ వసూల్ చేస్తూ ఉంటే ఫ్యాన్స్ కోరుకునే ఫ్యాన్స్ స్టఫ్ ని ప్రతీ సినిమా లో ఉండేలా చూసుకుంటున్న విజయ్ రీసెంట్ మూవీస్ అన్నింటి తో కూడా…
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ లను సొంతం చేసుకోవడమే కాదు తెలుగు లో కూడా సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం ఒక మీడియం రేంజ్ హీరోలకి తెలుగు లో ఉండే మార్కెట్ ని తక్కువ టైం లోనే సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాడు.
ఇలాంటి టైం లో తెలుగు లో కూడా స్టార్ హీరోల రేంజ్ మార్కెట్ కి ట్రై చేస్తున్న విజయ్ ఇప్పుడు ఎవ్వరూ ఊహించని విధంగా ఇతర కోలివుడ్ యాక్టర్స్ ఇన్ని ఇయర్స్ లో చేయలేక పోయిన పనిని చేయడానికి సిద్ధం అయ్యాడు. కోలివుడ్ నుండి తెలుగు లో మార్కెట్ ఉన్న హీరోలు అందరూ…
తెలుగు లో స్ట్రైట్ మూవీస్ అయితే చేయలేదు. ఎవరో ఒకరిద్దరూ అరకొర సినిమాలు చేసినా ఎవ్వరూ ఫుల్ ఫ్లెట్చుడ్ గా అయితే ట్రై చేయలేదు. ఇప్పుడు విజయ్ మాత్రం తెలుగు డైరెక్టర్ స్టొరీ ని ఓకే చేసి తెలుగు ప్రొడ్యూసర్ తో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్వాలిటీ మూవీస్ చేసిన వంశీ పైడిపల్లి…
డైరెక్షన్ లో విజయ్ హీరోగా తెలుగు టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరైన దిల్ రాజు నిర్మాతగా పాన్ ఇండియా లెవల్ లో సినిమా రూపొందబోతుందట. ఈ విషయాన్ని డైరెక్టర్ వంశీ పేపర్ ఇంటర్వ్యూలో అఫీషియల్ గా కన్ఫాం చేయగా పాండమిక్ తర్వాత అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయబోతున్నారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే విజయ్ మార్కెట్ తెలుగు లో స్టార్ హీరోల లెవల్ కి చేరుకోవడం ఖాయం.