బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక్క స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితేనే థియేటర్స్ అన్నీ సందడిగా కళ కళ లాడుతూ ఉంటాయి, అలాంటిది పండగల టైం లో ఒకటికి మించి అప్పుడప్పుడు సినిమాలు పోటి పడటం కామన్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రలలో అంటే చాలా వరకు ఎక్కువ థియేటర్స్ ఉన్నాయి కాబట్టి పోటి ఒకవేళ ఎక్కువ అయినా కానీ సినిమాల రేంజ్ ని బట్టి థియేటర్స్ ని సమంగా పంచె అవకాశం ఉంటుంది.
కానీ మన దగ్గరతో పోల్చితే పక్క రాష్ట్రం తమిళనాడు లో థియేటర్స్ లెక్క చాలా తక్కువ మన దగ్గర ఓవరాల్ థియేటర్స్ 1600 కి పైగా ఉంటే తమిళనాడు లో మొత్తం మీద 850 వరకు థియేటర్స్ ఉన్నాయి. టోటల్ స్క్రీన్స్ కూడా అక్కడ 1100 లోపే ఉన్నాయి.
దాంతో ఒక్క స్టార్ హీరో సినిమా రిలీజ్ అయితేనే థియేటర్స్ అన్నీ ఆ సినిమాకే ఇస్తారు, అలాంటిది అప్పుడప్పుడు సంక్రాంతి టైం లో రెండు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినా థియేటర్స్ ని సమంగా పంచారు కానీ ఇప్పుడు ఇంకొంచం పోటి ఎక్కువ అయ్యే అవకాశం ఈ ఇయర్ లో ఉందీ అంటూ…
వార్తలు చాలా గట్టిగానే చక్కర్లు కొడుతున్నాయి కోలివుడ్ లో…. ఏకంగా ముగ్గురు టాప్ హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ ఎండ్ లో దీపావళి సమయం లో పోటి పడే అవకాశం ఉందని అంటున్నారు. అజిత్ నటించిన వలిమై సినిమా ఆల్ రెడీ దీపావళి రిలీజ్ ను కన్ఫాం చేసుకోగా, తర్వాత ఇప్పుడు రజినీకాంత్ నటించిన అన్నాట్టై సినిమా కూడా..
దీపావళి టైం కే ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు ఈ రెండు సినిమాలతో పాటు ప్రజెంట్ విపరీతమైన ఫాం లో ఉన్న దళపతి విజయ్ నెల్సన్ ల కాంబోలో వస్తున్న సినిమాను దీపావళి బరిలోనే దింపే ఆలోచన చేస్తున్నారట. ఇది కనుక నిజం అయితే 850 థియేటర్స్ ని మూడు సినిమాలకు పంచాల్సి వస్తుంది, మరి ఏమవుతుందో చూడాలి ఇక.
Bro THALAPATHY-NELSON MOVIE AND ANNANAATHE MOVIE KI SAME PRODUCER SO TWO CINEMALANU OKA SARI RELEASE CHEYARU