Home టోటల్ కలెక్షన్స్ 40 లక్షలతో సినిమా తీస్తే…వచ్చిన కలెక్షన్స్ ఇవీ…దారుణం ఇది!

40 లక్షలతో సినిమా తీస్తే…వచ్చిన కలెక్షన్స్ ఇవీ…దారుణం ఇది!

1

బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ మొదలు పెట్టడం హిట్ మూవీ తో మొదలు పెట్టి ఏకంగా డజను సినిమాల ఆఫర్స్ ను సొంతం చేసుకున్న యాక్టర్ గా సంచలనం సృష్టించాడు తారకరత్న. ఫస్ట్ సినిమా ఒకటో నంబర్ కుర్రాడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ గా నిలవడంతో లెక్కకు మిక్కిలి వచ్చిన ఆఫర్స్ అన్నీ ఒప్పుకోగా అందులో ఒక్కటి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అంచనాలను అందుకోలేక పోవడంతో కంప్లీట్ గా ఫేడ్ అవుట్ అయ్యాడు ఈ హీరో..

తర్వాత రూట్ మార్చి విలన్ గా ట్రై చేసి అమరావతి అనే మూవీ తో మెప్పించిన తారకరత్న మళ్ళీ హీరోగా అడపా దడపా ట్రై చేసి విఫలం అయ్యి తన కెరీర్ కంప్లీట్ గా డౌన్ ఫాల్ అయింది, ఇలాంటి టైం లో తన సినిమాలను జనాలు పట్టించుకోవడం కూడా మానేసిన పరిస్థితి ఏర్పడగా…

ఈ మధ్య కాలంలో సైడ్ రోల్స్ చేసిన ఒకటి రెండు సినిమాలు వచ్చినప్పటికీ అవి కూడా ఎవరూ పట్టించుకోలేదు, ఇక ఇప్పుడు తను ప్రధాన పాత్ర పోషిస్తూ చేసిన లేటెస్ట్ మూవీ దేవినేని సెకెండ్ వేవ్ కన్నా ముందు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఈ సినిమా కూడా భారీ పోటి లో రిలీజ్ అవ్వడంతో ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు.

దాంతో బాక్స్ ఆఫీస్ దగ్గర వీకెండ్ కూడా నిలవలేక పోయిన ఈ సినిమా అన్ని సెంటర్స్ లో డెఫిసిట్ లు నెగటివ్ షేర్స్ ని సొంతం చేసుకుని పరుగును వీకెండ్ తర్వాతే ముగించేసింది, మొత్తం మీద కలెక్షన్స్ ని గమనిస్తే 3 లక్షల రేంజ్ కూడా ఉండదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి….. ఈ రేంజ్ లో డౌన్ ఫాల్ ని ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ చేసి ఉండరు అని చెప్పాలి.

నెగటివ్ షేర్స్, డెఫిసిట్ లు లాంటివి పక్కకు పెడితే టోటల్ షేర్ ఒక 6 లక్షల రేంజ్ లో ఉండొచ్చని అంచనా, సినిమా బడ్జెట్ ఒక 40 లక్షలలో రూపొందింది అన్న టాక్ ఉంది, బడ్జెట్ లో ఒక శాతం కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రికవరీ చేయలేక పోయిన ఈ సినిమా తారకరత్న మార్కెట్ ఏ రేంజ్ లో దెబ్బ కొట్టిందో చెప్పకనే చెప్పింది.

1 COMMENT

  1. అబ్బాయి తారక రత్న …సారథి మూవీ తొందరలో ఉంది..అదిరిపోద్ది చూదండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here