మాస్ మహారాజ్ రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ క్రాక్, బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 4 పరాజయాలను సొంతం చేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో కంబ్యాక్ ఇవ్వాల్సిన అవసరం తో క్రాక్ సినిమా ఈ ఇయర్ సంక్రాంతి కి బరిలోకి దిగింది. రిలీజ్ రోజునే అనేక అవరోధాలను ఎదురుకున్న ఈ సినిమా థియేటర్ సమస్య ని కూడా సొంతం చేసుకోవాల్సి వచ్చింది. వీటితో పాటు 50% లిమిటేషన్ ని కూడా తట్టుకున్న క్రాక్ సినిమా…
బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత అల్టిమేట్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసి రవితేజ కెరీర్ లో సాలిడ్ కంబ్యాక్ మూవీ గా నిలిచింది, లాంగ్ రన్ లో రవితేజ కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ రికార్డులను నమోదు చేస్తూ ఏకంగా 39.16 కోట్ల షేర్ ని సాధించి…
బిజినెస్ మీద 21.66 కోట్ల ప్రాఫిట్ ను సాధించి సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచి తర్వాత డిజిటల్ రిలీజ్ లో సాలిడ్ విజయాన్ని టెలివిజన్ లో అద్బుతమైన TRP రేటింగ్ లను సొంతం చేసుకుంటూ దూసుకు పోయిన ఈ సినిమా రీసెంట్ గా థియేటర్ లో….
మళ్ళీ రిలీజ్ ను సొంతం చేసుకుంది, సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్ర తరం అవ్వడం తో థియేటర్స్ అన్నీ మూత బడగా రీసెంట్ గా కేసులు తగ్గుమొఖం పట్టడం తో కొన్ని చోట్ల థియేటర్స్ ని రీ ఓపెన్ చేశారు, ఆంధ్రాలో వైజాగ్ ఏరియాలో జగదాంబ థియేటర్ ని రీసెంట్ గా రీ ఓపెన్ చేయగా రోజుకు ఒక షో మాత్రమే వేసి జనాలు వస్తున్నారా లేరా…
తెలుసు కుందాం అని ఒక ప్రయత్నం చేయగా క్రాక్ సినిమాను రీ రిలీజ్ చేశారు, కాగా ఒక్క షో నే వేసినా 50% లిమిటేషన్ లో కూడా సినిమా కి ఫస్ట్ డే 1641 గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే జనాలు మెళ్లి మెళ్లి గా థియేటర్స్ కి వచ్చే అవకాశం ఉందనిపిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. జులై లో పరిస్థితులు మరింత నార్మల్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.