Home గాసిప్స్ బాలయ్య అప్ కమింగ్ 6 మూవీస్ ఇవే….ఊరమాస్ ఇదీ!

బాలయ్య అప్ కమింగ్ 6 మూవీస్ ఇవే….ఊరమాస్ ఇదీ!

0

నట సింహం నందమూరి బాలకృష్ణ బాక్ టు బాక్ డిసాస్టర్ మూవీస్ తర్వాత ఇప్పుడు సాలిడ్ కంబ్యాక్ కి రంగం సిద్ధం చేస్తున్నాడు. సింహా లెజెండ్ సినిమాలతో తను ఫ్లాఫ్స్ లో ఉన్న టైం లో సెన్సేషనల్ కంబ్యాక్ తో పాటు బ్లాక్ బస్టర్ లను ఇచ్చిన డైరెక్టర్ బోయపాటి శ్రీను తో అఖండ సినిమా చేస్తున్న బాలయ్య ఈ సినిమాను ముందుగా రిలీజ్ చేయబోతుండగా ఈ సినిమా తర్వాత ఏకంగా 5 సినిమాలను…

కమిట్ అయ్యారని లేటెస్ట్ గా టాలీవుడ్ లో స్ట్రాంగ్ బజ్ నెలకొంది, అందులో కొన్ని ప్రాజెక్ట్ లు కన్ఫాం అవ్వగా కొన్ని ప్రాజెక్ట్ లు స్టొరీ స్టేజ్ లో ఉన్నట్లు సమాచారం. ఒక సారి ఆ లిస్టు ను గమనిస్తే ముందుగా బోయపాటి తో అఖండ తన కెరీర్ లో 106 వ సినిమాగా…

రూపొందుతుండగా 107 వ సినిమాను గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో చేయబోతున్నాడు బాలయ్య, ఇక 108 వ సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్నాడు బాలయ్య, బాలయ్య నెక్స్ట్ మూడు సినిమాలు అల్టిమేట్ కాంబినేషన్లు అనే చెప్పాలి. ఇక బాలయ్య 109 వ సినిమాను యంగ్ డైరెక్టర్….

వెంకీ అట్లూరి డైరెక్షన్ లో ఉండే అవకాశం ఉందని సమాచారం, తర్వాత 110 వ సినిమా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఉండబోతుందని సమాచారం. ఇక తర్వాత 111 సినిమా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో ఉండవచ్చని సమాచారం. ఈ కాంబినేషన్లు ఆల్ మోస్ట్ స్టొరీ స్టేజ్ లో ఉన్నాయని, ఒకటి తర్వాత ఒకటి కమిట్ అవ్వొచ్చు అని అంటున్నారు. వీటితో పాటు బాలయ్య మరో 3 సినిమాలు ఫ్యూచర్ లో చేయోచ్చు.

ఒకటి కే ఎస్ రవికుమార్ డైరెక్షన్ లో, ఒకటి బి గోపాల్ డైరెక్షన్ లో ఉండే అవకాశం ఉందని అంటున్నారు, ఈ ఇద్దరు సీనియర్ డైరెక్టర్స్ తో కథలు ఓకే అయితే కన్ఫాం మూవీ ఉంటుందని అంటున్నారు, ఇక వీటితో పాటు బాలయ్య ఓన్ డైరెక్షన్ లో ఆదిత్యా 369 సీక్వెల్ ఉంటుందని రీసెంట్ గా చెప్పుకొచ్చారు, ఈ సినిమాతో మోక్షజ్ఞ ఎంట్రీ కూడా ఉంటుందని చెప్పారు. మరి ఈ లైనప్ ఇలానే ఉంటే బాలయ్య మాస్ ఓ రేంజ్ లో జోరు చూపడం ఖాయమని చెప్పొచ్చు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here